స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల వారసుడు తెరమీదకు వస్తున్నాడు. రోషన్ కనకాలని హీరోగా పరిచయం చేస్తూ క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల ఫేమ్ రవి పేరేపు దర్శకత్వంలో రూపొందిన లవ్ రొమాంటిక్ డ్రామా బబుల్ గమ్ డిసెంబర్ 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్ సమర్పణ కావడంతో ప్రమోషన్లు గ్రాండ్ గా మొదలయ్యాయి. హీరోల వారసులు రావడం కొత్తేమి కాదు కానీ ఇలా వ్యాఖ్యాత, క్యారెక్టర్ ఆర్టిస్టుల కుటుంబం నుంచి హీరో రావడం ఎంతైనా ప్రత్యేక విశేషమే.
టైటిల్ కు తగ్గట్టే బబుల్ గమ్ లో ఏముంటుందో చెప్పేశారు. మటన్ కొట్టుతో వ్యాపారం చేసే తండ్రికి పుట్టిన కొడుగ్గా ఆదిత్య(రోషన్ కనకాల) కు బోలెడు ఆశలు, కష్టాలు ఉంటాయి. స్నేహితులతో దావత్ చేసుకోవాలన్నా పదిసార్లు ఆలోచించే పరిస్థితి. అలాంటి కుర్రాడి జీవితంలోకి దివ్య(మానస చౌదరి) వస్తుంది. బాగా డబ్బున్న అమ్మాయి. ఈమెతో పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. లైఫ్ పబ్బులు, ఎంజాయ్ మెంట్ల దాకా వెళ్తుంది. ఇలా గడిచిపోతుండగా ఆదిత్య చిక్కుల్లో ఇరుక్కుంటాడు. తెగిస్తే ఎంత దూరమైనా వెళ్లే ఇతని మనస్తత్వం అన్ని సవాళ్ళను ఎదురుకునేందుకు సిద్ధపడుతుంది. అదేంటో తెరమీద చూడాలి
పూర్తి యూత్ ఫుల్ కంటెంట్ తో నింపేశారు దర్శకుడు రవి పేరేపు, ప్రస్తుత యువతరం ఆలోచనలను ప్రతిబింబిస్తూ లవ్ స్టోరీనే కాస్త వైల్డ్ టచ్ తో చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. సందర్భానికి తగ్గట్టు కొన్ని సింపుల్ బూతులు కూడా జొప్పించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా సురేష్ ఛాయాగ్రహణం అందించారు. విజువల్స్, బీజీఎమ్ కూల్ గా ఉన్నాయి. రోషన్ కనకాలలో తల్లి పోలికలు, తండ్రి గొంతు బాగా ప్రతిబింబించాయి . సరిగ్గా సానబెట్టి మంచి కథలు కాంబోలు చేస్తే హీరోగా నిలదొక్కుకోవచ్చు. సక్సెస్ అయితే ఈ అబ్బాయే ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టొచ్చు
This post was last modified on %s = human-readable time difference 4:48 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…