ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా.. తెరపై గ్లామరస్‌గా కనిపిస్తుందే తప్ప విపరీతంగా ఎక్స్‌పోజింగ్ ఏమీ చేయదు. ఇంటిమేట్ సీన్లు కూడా పెద్దగా చేసింది లేదు. ఒక్క విజయ్ దేవరకొండతో మాత్రమే ఆమె లిప్ లాక్ సీన్లలో నటించింది. ‘గీత గోవిందం’తో పాటు ‘డియర్ కామ్రేడ్’లోనూ ఆమె ఈ సీన్లలో నటించింది. వేరే చిత్రాల్లో అలా నటించాల్సిన అవసరం రాలేదా.. లేక రష్మికనే వాటికి ఒప్పుకోలేదా అన్నది తెలియదు.
అలాంటి హీరోయిన్ సందీప్ రెడ్డి వంగా కొత్త చిత్రం ‘యానిమల్’లో నటిస్తోందంటేనే ఇందులో ఇంటిమేట్ సీన్లు ఉంటే ఓకే చేస్తుందా అన్న క్యూరియాసిటీ కలిగింది యువ ప్రేక్షకుల్లో. సందీప్ తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’లో లిప్ లాక్స్ మోత మోగిపోయిన సంగతి తెలిసిందే. పైగా ఈసారి అతను చేస్తోంది బాలీవుడ్ మూవీ. అందులోనూ రొమాంటిక్ కింగ్ రణబీర్ కపూర్ హీరో. దీంతో కచ్చితంగా ఇందులో ఇంటిమేట్ సీన్లు ఉంటాయనే అభిప్రాయం కలిగింది.
పైగా సినిమాలో ఒక వయొలెంట్ ఫస్ట్ నైట్ సీన్ ఉంటుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది ఈ మధ్య. ఇలాంటి టైంలో ‘యానిమల్’ నుంచి తొలి పాటను అనౌన్స్ చేశారు ఈ రోజు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా వదిలారు. అందులో రణబీర్‌తో లిప్ లాక్ చేస్తూ కనిపించింది రష్మిక. విజయ్ తర్వాత ఆమె లిప్ లాక్ చేస్తోంది రణబీర్‌తోనే.
సందీప్ సినిమాల్లో ఎలాంటి సన్నివేశం అయినా గాఢత ఎక్కువ ఉంటుంది. రొమాన్స్ అయితే ఇంకా ఘాటుగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. తొలి పాటతోనే లిప్ లాక్ పోస్టర్ వదిలారంటే సినిమాలో కూడా ఘాటు రొమాన్స్ తప్పక ఉంటుందనే అభిప్రాయం కలుగుతోంది. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా జరుగుతున్న ‘వయొలెంట్ ఫస్ట్ నైట్’ ప్రచారం నిజమే అనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తే. కాబట్టి రష్మికను హాట్ హాట్‌గా చూడాలనుకునే కుర్రాళ్లకు పండగ అన్నమాటే.
This post was last modified on October 10, 2023 3:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…
మూడు రాజధానుల నుంచి మద్యం వరకు.. వలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయాల వరకు.. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు…
వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి బ్రాండ్ అంబాసడర్ గా పని…
ఇటీవలే విడుదలైన కేసరి చాఫ్టర్ 2కి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మూడుకు తక్కువ రేటింగ్స్ దాదాపుగా ఎవరూ…
ఐపీఎల్ 2025లో ఓ మ్యాచ్ ఫలితం చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో…