ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న భగవంత్ కేసరి కోసం నందమూరి అభిమానులు మాములు వెయిటింగ్ చేయడం లేదు. అఖండ, వీరసింహారెడ్డిల తర్వాత హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంతో ధీమాగా ఉన్నారు. ట్రైలర్ వచ్చాక అంచనాల్లో చాలా మార్పు వచ్చేసింది. ఇదేదో కేవలం మాస్ ఎంటర్ టైనర్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ ఉన్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఎక్కువ ఆకర్షించేందుకు ఛాన్స్ దొరికింది. ముఖ్యంగా శ్రీలీల, బాలయ్యల బాండింగ్ ని చూపించిన తీరు హత్తుకునేలా ఉండటం హైలైట్.
వీళిద్దరి మధ్య బంధం తాలూకు ట్విస్ట్ ఏంటనే డౌట్ ఉండటం సహజం. ఇందులో శ్రీలీల పాత్ర పేరు విజయలక్ష్మి అలియాస్ విజ్జి పాప. ఆ పిలుపు ట్రైలర్ లోనే వినిపించింది. భగవంత్ కేసరికి మేనకోడలు. ఆర్మీ ఆఫీసరైన తండ్రి పాత్ర శరత్ కుమార్ చనిపోతే ఆమె సంరక్షణ మేనమామగా బాలయ్య మీద పడుతుంది. అంతే కాదు బావ చివరి కోరికగా ఎలాగైనా సరే మేనకోడలిని మిలిటరీలో చేరేంత ధృడంగా మార్చాలనుకుంటాడు. అయితే ఈ పరిస్థితికి కారణమైన రాహుల్ సంఘ్వి ఏం చేశాడు, బాలయ్య జైలుకు ఎందుకు వెళ్ళాడు లాంటి బోలెడు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.
సో మామా కోడలు అంటే తెలుగు ప్రేక్షకులకు మాములు ఎమోషన్ కాదు. మేనమామ బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ చేసిన ముద్దుల మావయ్య లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇప్పుడు భగవంత్ కేసరిలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో చాలా డిఫరెంట్ గా అనిల్ రావిపూడి చూపించే ప్రయత్నమైతే చేశాడు. లియో, టైగర్ నాగేశ్వరరావులతో పోటీ ఎదురుకుంటున్న భగవంత్ కేసరికి మాస్ కేంద్రాలు బలంగా నిలవబోతున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోసారి దన్నుగా నిలవాలి. కౌంట్ డౌన్ దగ్గర పడటంతో రేపటి నుంచి బాలయ్యతో పాటు టీమ్ మొత్తం ప్రమోషన్ వేగవంతం చేయబోతున్నారు.
This post was last modified on October 10, 2023 1:43 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…