Movie News

రిస్కీ దర్శకుడితో నాగార్జున 100?

స్టార్ హీరోలు వందో సినిమా అనే మైలురాయి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. బాలకృష్ణ అందుకే ఏరికోరి మరీ గౌతమీపుత్ర శాతకర్ణిని ఎంచుకున్నారు. మంచి విజయం అందుకున్నారు. చిరంజీవి 1988లో త్రినేత్రుడుని తన స్వంత బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించుకున్నారు. వెంకటేష్ కి ఈ ల్యాండ్ మార్క్ ఇంకా దూరంలో ఉంది కానీ నాగార్జున మాత్రం నా సామి రంగా పూర్తి చేయగానే దీని మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాకు ఓకే చెప్పారనే టాక్ గతంలో వచ్చింది కానీ ఆయన తని ఒరువన్ 2కి లాక్ అయిపోవడంతో నాగ్ ప్రాజెక్ట్ రద్దయినట్టుగానే భావించాలి.

ఇప్పుడో కొత్త పేరు తెరపైకి వచ్చింది. కోలీవుడ్ నుంచి నవీన్ అనే దర్శకుడు చెప్పిన లైన్ బాగా నచ్చడంతో నాగ్ సానుకూలంగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్. అయితే రిస్కని చెప్పడానికి కారణం ఉంది. సదరు నవీన్ ఇప్పటిదాకా తీసింది రెండు సినిమాలే. మొదటిది 2013లో వచ్చిన మూడర్ కుడం. బాగానే పేరు తెచ్చింది. తర్వాత 2021లో విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా అగ్ని సిరగుగల్ తీశారు. కానీ రెండేళ్లు దాటుతున్నా ఇది విడుదలకు నోచుకోలేదు. కారణాలు చెప్పడం లేదు కానీ అదిగో ఇదిగో అంటూ ఆలస్యం చేస్తూనే ఉన్నారు. అంటే పది సంవత్సరాల టైంలో నవీన్ చేసింది రెండు సినిమాలే.

నిర్మాతగా రచయితగా పేరున్న నవీన్ కు దర్శకుడిగా మాత్రం ఇంకా ప్రత్యేక ముద్ర పడలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నవీన్ కు కింగ్ నాగ్ ఓకే చెప్పారంటే విషయం ఏదో బలంగా ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 7, నా సామి రంగా షూటింగులతో బిజీగా ఉన్న నాగార్జున 100కు సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించడానికి మరి కొంత సమయం తీసుకోవచ్చు. ఈలోగా నవీన్ ఫుల్ వెర్షన్ కనక సిద్ధం చేసి మెప్పిస్తే జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ప్యాన్ ఇండియా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అన్నట్టు ఈ ప్రతిపాదన వెనుక హీరో కార్తీ రికమండేషన్ ఉందని మరో న్యూస్. ఊపిరి నుంచి ఏర్పడ్డ స్నేహం వల్ల నవీన్ ని ఆయనే పంపారట. 

This post was last modified on October 9, 2023 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

3 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

4 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

4 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

5 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

5 hours ago