బోయపాటి శ్రీను సినిమాలంటే లాజిక్కులు పూర్తిగా అటకెక్కేస్తాయి. ఆయన సినిమాలకు వెళ్తుంటే మైండ్ ఆఫ్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుందని కౌంటర్లు పడుతుంటాయి సోషల్ మీడియాలో. ఆయన సినిమాల్లో కథ, పాత్రలు.. సన్నివేశాలు.. అన్నీ కూడా ఇల్లాజికల్‌గా ఉంటాయి. కమర్షియల్ సినిమాలన్నాక ప్రతిదీ లాజిక్ ప్రకారం నడవాలంటే కష్టం కానీ.. బోయపాటి సినిమాల్లో మరీ టూమచ్ అనిపించేలా సీన్లు ఉంటాయి.
ఆయన కొత్త చిత్రం స్కంద అయితే ఈ విషయంలో మరీ శ్రుతిమించి పోయింది. విలన్లు ఇద్దరినీ ముఖ్యమంత్రులుగా చూపించి.. వాళ్లతో హీరో ఫుట్‌బాల్ ఆడుకున్నట్లు చూపించడం మరీ విడ్డూరం. ఒక పల్లెటూరికి చెందిన మామూలు కుర్రాడు.. సెక్యూరిటీ మొత్తాన్ని ఆటాడించి సీఎం ఇళ్లలోకి వెళ్లిపోవడం.. సీఎం భయపడి నీకు కావాల్సింది తీసుకుపో అనడం.. ఇద్దరు సీఎం కూతుళ్లను హీరో సింపుల్‌గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం.. ఇలాంటి విడ్డూరాలెన్నో ‘స్కంద’లో ఉన్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వాళ్ల వాళ్ల రాజధానుల్లో ఉండి పరిపాలన చూసుకుంటారు కానీ.. ఎంతసేపూ పనీ పాటా వదిలేసి ఇద్దరూ ఒకే ఇంట్లో కూలబడి ఉండటం కూడా సిల్లీగా అనిపించింది. ఈ విషయాల మీద సోషల్ మీడియాలో మామూలుగా కౌంటర్లు పడలేదు. ఐతే తన సినిమాల్లో లాజిక్కుల గురించి వచ్చే విమర్శల గురించి బోయపాటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
నిజ జీవితంలో ఎవరైనా రోడ్ల మీద పాటలు పాడుకుని, డ్యాన్సులు వేస్తారా.. లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇది జరగదని.. అలాంటపుడు సినిమాల్లో పాటలే పెట్టలేమని అతనన్నాడు. ఫైట్ సీన్లు మామూలుగా తీస్తే జనాలకు ఎక్కదని.. తన సినిమాల్లో హీరోను పవర్‌ఫుల్‌గా చూపించడానికి కొంచెం ఓవర్ ద టాప్ స్టయిల్లో యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని బోయపాటి అన్నాడు. హీరో పవర్ ఫుల్ కాబట్టే సీఎంలను ఢీకొట్టి గెలిచినట్లు చూపించామన్నాడు. సినిమాలో విలన్లు సీఎంలు కాబట్టి సీఎంలను చెడుగా చూపించినట్లు కాదని బోయపాటి వివరణ ఇచ్చాడు.
This post was last modified on October 7, 2023 11:18 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…
ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన…
అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని…