కరోనా టైంలో ఓటీటీలో చడీచప్పుడు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి. అలాంటి సినిమాల్లో మా ఊరి పొలిమేర ఒకటి. కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేసే సత్యం రాజేష్ ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. బాలాదిత్య, గెటప్ శీను ఇతర ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా చేతబడుల చుట్టూ తిరిగే థ్రిల్లర్. సినిమాలో కొన్ని గగుర్పొడిచే సీన్లు ఉంటాయి.
అలాగే కొన్ని ట్విస్టులు కూడా అదిరిపోతాయి. చాలా తక్కువ బడ్జెట్లోనే ఆసక్తికరంగా సినిమా తీసి మెప్పించాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. హాట్ స్టార్ ఓటీటీలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై.. నెమ్మదిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి మంచి ఆదరణ పొందింది మా ఊరి పొలిమేర. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని.. ఆ సినిమాలోనే హింట్ ఇచ్చారు.
ఇప్పుడు పొలిమేర-2 పేరుతో సీక్వెల్ కూడా రెడీ చేసేశారు. ఫస్ట్ పార్ట్‌కు మంచి ఆదరణ దక్కడంతో కొంచెం బడ్జెట్ పెంచి, కాస్టింగ్ పరంగా ఆకర్షణలు జోడించి సినిమాను తీర్చిదిద్దింది టీం. ఈ సినిమాకు కాస్త బజ్ ఉండటంతో థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది.
ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను.. నందిపాటి వంశీతో కలిసి బన్నీ వాసు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాడట. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా పొలిమేర-2 రిలీజ్ కాబోతోంది. నవంబరు 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గీతా సంస్థ ద్వారా రిలీజ్ అంటే ఒక స్థాయిలోనే ఉంటుంది. సినిమాను బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారు కూడా. మొత్తానికి ఈ చిన్న సినిమాకు రిలీజ్ ముంగిట పెద్ద బూస్ట్ దక్కబోతున్నట్లే.
This post was last modified on October 7, 2023 11:13 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…