Movie News

అన్ స్టాపబుల్ 3 కోసం ప్రత్యేక అతిథులు

ఓటిటి  టాక్ షోలు ఎందరు నిర్వహించినా అన్ స్టాపబుల్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దేనికీ రాలేదన్నది వాస్తవం. రెండు సీజన్లు బ్రహ్మాండమైన స్పందన దక్కించుకున్నాయి. సినిమా కెమెరా ముందు తప్ప బయట తడబడతారని పేరున్న బాలయ్య ఈ ప్రోగ్రాంని నడిపించిన తీరు ఆహాకు పెద్ద మైలేజ్ తీసుకొచ్చింది . కొత్త సినిమాల కన్నా మెరుగ్గా వ్యూస్, రెవెన్యూస్ వచ్చి పడ్డాయి. అయితే బాలయ్య రాజకీయ అవసరాలతో పాటు  షూటింగుల పరంగా బిజీగా ఉండటంతో ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో అన్ స్టాపబుల్ 3 పరిమిత ఎపిసోడ్లను తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

గెస్టులు ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆప్త మిత్రుల కలయిక చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్ ఈసారి సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువేనట. ఆ మేరకు అల్లు అరవింద్ తన బావని ఒప్పించినట్టు మెగా కాంపౌండ్ న్యూస్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,  ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ. గోపిచంద్, అడవి శేష్, రవితేజ, శర్వానంద్ లాంటి స్టార్లందరూ ఆల్రెడీ పూర్తయ్యారు కాబట్టి ఈసారి రిపిటీషన్ లేకుండా కొత్త ఆకర్షణలు తీసుకొచ్చేనందుకు ఆహ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా మెగాస్టార్ ని లాక్ చేసినట్టు వినికిడి.

సాధ్యమైన మేరకు తెలంగాణ మంత్రి కెటిఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, రాజశేఖర్, శివరాజ్ కుమార్, మమ్ముట్టిలను తీసుకొచ్చేందుకు అన్ని రకరాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరు సాధ్యమైతే వాళ్ళతో చకచకా షూటింగ్ చేసేస్తారు. భగవంత్ కేసరి రిలీజయ్యాక బాలయ్యకు కాస్త ఫ్రీ టైం దొరుకుంది. ఆ తర్వాత దర్శకుడు బాబీ సినిమా మొదలుపెట్టాలి. ఫిబ్రవరి నుంచి ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ కావాల్సి ఉంటుంది.  సో ఎక్కువ భాగాలకు ఛాన్స్ ఉండదు. లిమిటెడ్ అన్నారు కాబట్టి పైన చెప్పినట్టుగా చాలా స్పెషల్ గెస్టులే రావడం కన్ఫర్మ్. 

This post was last modified on October 7, 2023 8:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

8 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

9 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

13 hours ago