ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే అదృష్టం. వాటిని సరైన రీతిలో వాడుకుని హిట్లు కొడితే నాలుగు కాలాలు పరిశ్రమలో ఉండి మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఒకటి రెండు పొరపాట్లు చేస్తే సరే కానీ అవి పదే పదే రిపీట్ అవుతూ ఉంటే మాత్రం చాలా కష్టం. కిరణ్ అబ్బవరంకు ఈ సూత్రం వీలైనంత త్వరగా ఒంటబట్టడం ఎంతో అవసరం. అతని తాజా సినిమా రూల్స్ రంజన్ కు ఇటు మీడియా అటు ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారన్న యూనిట్ సభ్యుల మాట చివరికి నవ్వులపాలయ్యేలా ఉంది.
అత్యవసరంగా కిరణ్ అబ్బవరం తన స్టోరీ సెలక్షన్ ని విశ్లేషించుకోవాలి. స్వతహాగా తనే ఒక రచయిత. ఎస్ఆర్ కళ్యాణ మండపానికి కథ స్క్రీన్ ప్లే మాటలు స్వంతంగా రాసుకున్నాడు. అలాంటప్పుడు హీరోగా మరొకరి సబ్జెక్టుని జడ్జ్ చేసే విషయంలో కఠినంగా ఉండాలి. కానీ కిరణ్ ఎంపికలో అలాంటి జాగ్రత్తలు కనిపించడం లేదు. రూల్స్ రంజన్ నే తీసుకుంటే పేపర్ మీద అవుట్ డేటెడ్ అనిపించే హాస్యం ఇప్పటి ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదని సులభంగానే గుర్తించవచ్చు. అయినా ఓకే చెప్పాడంటే నిర్ణయాలు తీసుకోవడంలో చేస్తున్న తప్పులు భారీ మూల్యానికి దారి తీస్తున్నాయి.
రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో ఎన్ని చెప్పినా తప్పు లేదు. తీరా ఫలితం తేడా కొట్టినప్పుడు అవే రివర్స్ లో బూమరాంగ్ అవుతాయి. కిరణ్ కి ఇది రిపీట్ అవుతోంది. మీటర్ టైంలోనూ ప్రాపర్ కమర్షియల్ సినిమా తీశామని పదే పదే చెప్పుకుని తీరా తెరమీద తనకు నప్పని మాస్ హీరోయిజంతో జనాన్ని విసిగించాడు. ఇప్పుడు రూల్స్ రంజన్ లో కామెడీ పేరుతో మళ్ళీ అదే పునరావృత్తం అయ్యింది. ఓపెనింగ్స్ పరంగా ఇప్పటికే పట్టు తప్పిన కిరణ్ అబ్బవరం డాల్బీ సౌండ్ లో మ్రోగుతున్న డేంజర్ బెల్స్ ని వినిపించుకుని వీలైనంత త్వరగా మారకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవు.
This post was last modified on October 7, 2023 12:27 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…