మీడియం సినిమాల మేళాగా మారిపోయిన శుక్రవారం చూసి ఆడియన్స్ ఏ సినిమాకు వెళ్లాలో అర్థం కాక రివ్యూలు, పబ్లిక్ టాక్, రిపోర్టుల కోసం ఎదురు చూశారు. చెప్పుకోదగ్గ స్టార్లు ఉంటేనే ఓపెనింగ్స్ రావడం కష్టమైపోయిన పరిస్థితుల్లో మార్కెట్ లేని నవీన్ చంద్ర, కలర్స్ స్వాతిని జంటగా పెట్టుకుని థియేటర్ రిలీజ్ కు వెళ్లడం సాహసమే. సరే కంటెంట్ బాగున్నప్పుడు జనం ఎవరున్నారనేది పట్టించుకోరని బలగం లాంటివి ఋజువు చేశాయి కాబట్టి ఇందులో కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉందేమోనని, ఓ లుక్ వేద్దామనుకున్న ఆడియన్స్ లేకపోలేదు. మరి అక్టోబర్ మంత్ లో వచ్చిన మధు ఎలా ఉందంటే
వైజాగ్ లో ఉండే మధుసూదన్(నవీన్ చంద్ర)ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుని విడాకుల నోటీసు పంపించిన భార్య లేఖ(స్వాతి రెడ్డి) మనసు మారి తన దగ్గరికి వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉండలేక తాగుడుకి అలవాటు పడతాడు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన మధు(శ్రేయ నవిలే) మధుసూదన్ కి పరిచయమవుతుంది. బొద్దుతనంతో ఇంటా బయట ఇబ్బందులు ఎదురుకుంటున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న మధుకి అతని కథ వినాలన్న ఆసక్తి కలుగుతుంది. ఈ ముగ్గురి లైఫ్ జర్నీ ఏంటి, ఏ రకంగా ముడిపడతారనేది అసలు స్టోరీ.
ఎమోషన్స్ అంటే సాగదీసిన సన్నివేశాలు, సంభాషణలు కాదని గుర్తించనంత కాలం మంత్ అఫ్ మధు లాంటి హెవీ డ్రామాలు వస్తూనే ఉంటాయి. భావోద్వేగాలు కనెక్ట్ కానప్పుడు నటీనటులు ఎంత బాగా నటించినా వృథానే అవుతుంది. శ్రీకాంత్ నాగోతి డైలాగుల మీద పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసేలా ఉందో లేదో చెక్ చేసుకోలేదు. దీంతో మధు కథ కాస్తా సాగదీసిన షార్ట్ ఫిలిం ఫీలింగ్ కలిగిస్తుంది. కమర్షియల్ అంశాలు వద్దనుకోవడం మంచి ఆలోచనే. అలా అని బోర్ కొట్టేలా నెరేట్ చేస్తే ప్రతి క్యారెక్టర్ అవసరం లేనిదే అనిపిస్తుంది ఎన్ఆర్ఐతో సహా. టన్నుల కొద్దీ ఓపిక ఉంటేనే మంత్ అఫ్ మధు ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on October 7, 2023 8:02 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…