ఈ ఏడాది టాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న బేబీ సంచలనం అంత ఈజీగా మర్చిపోయేది కాదు. తొంభై కోట్లకి పైగా గ్రాస్ సాధించి ట్రేడ్ సైతం నివ్వెరపోయేలా చేసింది. ఓటిటిలో మిశ్రమ స్పందన రావడంతో శాటిలైట్ లో ఫ్లాప్ కావడం ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. అయితే వాటిని బ్లాస్ట్ చేస్తూ గత వారం టెలికాస్ట్ అయిన బేబీ 5.89 అర్బన్, 5.67 రూరల్ టిఆర్పి రేటింగ్ తో ఆ రోజు వచ్చిన మరో రెండు సూపర్ హిట్స్ ని మించి సాధించింది. నాని దసరా 4.99తో రెండో స్థానంలో, శ్రీవిష్ణు సామజవరగమన 3.05 రేటింగ్ తో మూడో స్థానంలో నిలిచాయి.
ఇక్కడ మరో విశేషం ఉంది. బేబీని ప్రసారం చేసిన ఈటీవీకి సీరియల్స్ మినహాయించి సినిమాల పరంగా పెద్దగా ఆదరణ లేదు. కారణం కొత్త వాటిని కొనకపోవడమే. అప్పుడప్పుడు ఒకటి అరా కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, డియర్ మేఘ, పంచతంత్రం లాంటివి వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అవన్నీ యావరేజ్ చిత్రాలు. కానీ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ ఈటివికి దక్కడం విశేషం. దానికి తగ్గట్టే అంచనాలకు మించి రేటింగ్ తెచ్చుకోవడం ఇంకో ట్విస్టు. దీన్ని బట్టి ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్యల ప్రేమకథ ఎంత సెన్సేషన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా జరగడానికి కారణం లేకపోలేదు. దసరా, సామజవరగమనలను జనం ఓటిటిలో విపరీతంగా చూసేశారు. నెట్ ఫ్లిక్స్, ఆహా లేని వాళ్ళు సైతం ఆన్ లైన్ లో ఉన్న వివిధ మార్గాల ద్వారా, లోకల్ సిటీ కేబుల్ ద్వారా శుభ్రంగా వీక్షించారు. అలాంటప్పుడు మళ్ళీ అదే పనిగా యాడ్స్ తో చూసేందుకు ఆసక్తి చూపించరు. కానీ బేబీ కేసు వేరు. థియేటర్లలో కేవలం యూత్ ఎగబడ్డారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెళ్ళలేదు. పైగా క్యాస్టింగ్ వల్ల ఆహాలో చూసేందుకు పరుగులు పెట్టలేదు. దీంతో ఈ అవకాశం కాస్తా ఈటీవీకి కలిసి వచ్చి ఇలా ఊహించని విధంగా మంచి రేటింగ్స్ ఇచ్చింది.
This post was last modified on October 7, 2023 7:58 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…