వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ లాంటి సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. మహావీరుడు ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోకపోయినా దానికి జరిగిన బిజినెస్ కి ఓ మోస్తరు వసూళ్లతో బాగానే గట్టెక్కింది. తాజాగా అయలాన్ తో రాబోతున్నాడు. సంక్రాంతి బరిలో విపరీతమైన పోటీ ఉన్నా సరే తగ్గేదేలే అంటూ తమిళ టైటిల్ నే పెట్టుకుని మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ, నాగార్జునలను ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాడు. అంతగా సై అంటున్నారంటే కంటెంట్ ఏదో బలంగానే ఉంటుంది. ఇందాకా ఆన్ లైన్ వేదికగా నానితో ట్రైలర్ విడుదల చేయించారు.
కథేంటో క్లూస్ ఇచ్చారు. ఒక పల్లెటూరిలో చక్కగా జీవనం సాగించే ఒక కుర్రాడు(శివ కార్తికేయన్). ప్రపంచంలో ప్రతి తరం ఒక ఎనర్జీ వల్ల ప్రభావితమవుతుందని నమ్మే సైంటిస్టులు త్వరలో రాబోయే ప్రమాదాన్ని ఊహించలేకపోతారు. భూమికి లక్షల కిలోమీటర్ల పైనుంచి ఒక గ్రహాంతరవాసి దిగి సరిగ్గా హీరో ఉండే ఇంట్లో దిగుతాడు. బాష రాకపోయినా స్నేహితులంతా దాన్ని అక్కున చేర్చుకుంటారు. మరోవైపు దేశ శత్రువులతో పాటు అంతర్గతంగా ఉన్న దుష్టశక్తులు ఆ ఏలియన్ పవర్ కోసం దాన్ని స్వంతం చేసుకోవాలని కుట్ర పన్నుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు స్టోరీ.
విజువల్స్ మంచి గ్రాఫిక్స్ తో రూపొందించారు. హృతిక్ రోషన్ కోయి మిల్ గయా స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది. దాంతోపాటు క్రిష్ 2 లాంటి బాలీవుడ్ చిత్రాల నుంచి కూడా ఇన్స్ పిరేషన్ తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, నీరవ్ షా ఛాయాగ్రహణం సమకూర్చారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాగా ఈషా కొప్పికర్, యోగిబాబు, శరద్ కేల్కర్, భానుప్రియ, రాహుల్ మహదేవ్ తదితరుల తారాగణంతో టీమ్ బలంగా కనిపిస్తోంది. కంటెంట్ పరంగా ఎప్పుడూ చూడని ఫీలింగ్ అయితే ఇవ్వలేదు కానీ దర్శకుడు ఆర్ రవికుమార్ ప్రెజెంటేషన్ గురించి కోలీవుడ్ ప్రీ టాక్ పాజిటివ్ గా ఉంది.
This post was last modified on October 6, 2023 10:46 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…