సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తె’. తెలుగులో ‘శౌర్యం’ లాంటి హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత శంఖం, దరువు లాంటి ఫ్లాప్ చిత్రాలు తీసి.. ఆపై తమిళంలో విక్రమార్కుడు రీమేక్ ‘సిరుత్తై’తో సక్సెస్ సాధించి.. అజిత్‌తో వరుసగా ‘వీరం’, ‘వేదాళం’, ‘విశ్వాసం’ లాంటి బ్లాక్‌బస్టర్లు అందింంచిన శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
శివ స్టయిల్లోనే పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో రజినీ ఫస్ట్ లుక్ చూస్తే అదే విషయం స్పష్టమైంది. కరోనా లేకపోతే ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అని కూడా అనుకున్నారు. కానీ వైరస్ ఆ ప్రణాళికలను భగ్నం చేసింది. రజినీ ఇంకో ఐదారు నెలలు షూటింగ్‌కు రానని చెప్పేయడంతో ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది.
కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు తెలుగు యాక్షన్ హీరో, శివ మిత్రుడు గోపీచంద్‌ను ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. పూర్తిగా తమిళ నేటివిటీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎవరైనా తెలుగు నటుడిని పెట్టుకుంటే ఇక్కడి మార్కెట్‌కు ఉపయోగపడుతుందని అనుకున్నాడు శివ.
ఐతే ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని గోపీచంద్ ఖండించాడు. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. హీరోగా ఆశించిన విజయాలందుకోలేదు కానీ.. సత్యదేవ్ టాలెంట్ ఏంటో ఎప్పట్నుంచో చూస్తున్నాం.
ఈ మధ్య ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’తో మరోసారి అతను తన టాలెంట్ చూపించాడు. ఇటీవలే తమన్నా, సత్యదేవ్ కలయికలో ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అది అతడికి మంచి అవకాశమే. ఈలోపు రజినీ సినిమాలో అవకాశం అందుకున్నాడంటే విశేషమే.
This post was last modified on August 25, 2020 2:21 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…