ఈ వారం బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాల జాతర చూడబోతున్నాం. ఏకంగా ఏడెనిమిది సినిమాలు రిలీజవుతున్నాయి ఈ వారం. అందులో 6 నోటెడ్ రిలీజ్‌లు ఉన్నాయి. ఇంత పోటీలో రావడం కొన్ని మంచి సినిమాలకు చేటు చేసేలా కనిపిస్తోంది. రిలీజ్‌కు ముందే ప్రిమియర్స్ కూడా పడ్డ మూడు సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర కష్టం కాలం తప్పేలా లేదు. ఆ మూడు చిత్రాలకూ మంచి టాక్ కూడా వచ్చింది.
ఈ షోలు చూసిన మీడియా వాళ్లు, వేరే ప్రేక్షకులు చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. కానీ ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లూ దక్కలేదు. వాటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డల్లుగా ఉన్నాయి. ఆ చిత్రాలే.. మంత్ ఆఫ్ మధు, చిన్నా, 800. ఈ వారం వాటితో పాటు రిలీజవుతున్న మ్యాడ్, రూల్స్ రంజన్, మామా మశ్చీంద్రలకు కొంచెం బజ్ కనిపిస్తోంది. వాటి బుకింగ్స్ కూడా పర్వాలేదు.
కానీ ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాను చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువగా మల్టీప్లెక్సుల్లోనే షోలు ఇచ్చారు. అవి కూడా తక్కువే. ఈ సినిమా ప్రిమియర్ షో చూసిన వాళ్లు చాలా మంచి సినిమాగా చెబుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇదో భిన్నమైన సినిమా అనే సంకేతాలు ఇచ్చింది. కానీ ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకుల దృష్టిలో పడుతుందో సందేహంగానే ఉంది. ఇక సిద్దార్థ్ సినిమా ‘చిన్నా’కు ఆల్రెడీ తమిళంలో మంచి అప్రిషియేషన్ వచ్చింది.
ఈ రోజు తెలుగులో ప్రిమియర్ షో చూసిన వాళ్లు కూడా కదిలిపోయారు. గొప్ప సినిమా అని కొనియాడుతున్నారు. కానీ ఈ చిత్రానికి కూడా బజ్ తక్కువగానే ఉంది. లిమిటెడ్ రిలీజే చూడబోతున్నాం. ఇక మురళీధరన్ బయోపిక్ ‘800’కు బుధవారం ప్రిమియర్ వేయగా.. అందరూ మంచి సినిమా అన్నారు. కానీ మురళీధరన్ బయోపిక్‌ను మన వాళ్లు ఏమాత్రం ఓన్ చేసుకుంటారన్నది సందేహంగానే ఉంది. ఇది కూడా తక్కువ థియేటర్లలో రిలీజవుతోంది. పెద్దగా బుకింగ్స్ లేవు. మంచి సినిమాలని తెలుస్తున్నప్పటికీ.. ఇంత పోటీలో రిలీజవుతుండటం వీటికి చేటు చేసేలా ఉంది.
This post was last modified on October 5, 2023 10:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…