నాలుగున్నర కోట్లు అంటే చిన్న సినిమాలు రెండు తీసేయొచ్చు. ఇంత బడ్జెట్లో రామ్ అనే మిడ్ రేంజ్ హీరో సినిమాలో కేవలం ఒక్క యాక్షణ్ సీక్వెన్స్ తీశారు అంటే షాకవ్వకుండా ఉండలేదు. అతను హీరోగా నటించిన కొత్త చిత్రం ‘స్కంద’లో ఫస్ట్ ఫైట్‌కు అంతే బడ్జెట్ అయిందట. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ చిత్రంలో రామ్ ఇంట్రోను హైదరాబాద్ పాత బస్తీలో జరిగే సదరు పండగ నేపథ్యంలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. సదరు పండుగలో దున్నపోతుల మధ్య పోటీ నిర్వహిస్తుండగా.. అక్కడికి ముఖ్యమంత్రి వస్తాడు. బర్రెలకు ఇంజక్షన్లు ఇచ్చి అవి అదుపు తప్పే గందరగోళంలో సీఎంను లేపేయాలని ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేస్తే.. హీరో రంగంలోకి దిగి వాళ్లను అడ్డుకుంటాడు. ఈ నేపథ్యంలో బుల్ ఫైట్‌ను కొంచెం భారీగానే చిత్రీకరించాడు బోయపాటి.
రెగ్యులర్ ఫైట్లతో పోలిస్తే ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభూతినే ఇస్తుంది కానీ.. ఇది మరీ ఔట్ స్టాండింగ్, వావ్ అనుకునే రేంజిలో అయితే ఏమీ లేదు. ఈ యాక్షన్ సీక్వెన్సుకి ఏకంగా నాలుగున్నర కోట్లు పెట్టారంటే విడ్డూరంగానే అనిపిస్తుంది. రామ్ స్థాయి హీరో సినిమాలో ఇంత ఖర్చు టూ మచ్ అనే చెప్పాలి. ఈ సీక్వెన్స్ కోసం పెద్ద సంఖ్యలో బర్రెల్ని తెప్పించడంతో పాటు.. ఏకంగా 29 జనరేటర్లు వాడినట్లు బోయపాటి వెల్లడించాడు.
అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా భారీగా ఖర్చయిందని.. కొన్ని రోజుల పాటు రిహార్సల్స్ చేసి ఈ సీక్వెన్స్ తీశామని.. అందువల్ల భారీగా ఖర్చు తప్పలేదని బోయపాటి తెలిపాడు. ఐతే సినిమాలో కంటెంట్ మీద దృష్టిపెట్టకుండా.. ఇలాంటి అవసరం లేని హంగుల మీద ఫోకస్ పెట్టడం వల్లే ‘స్కంద’కు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని.. అందుకే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితం వస్తోందని అర్థమవుతోంది.
This post was last modified on October 4, 2023 10:50 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…