చిన్న సినిమాలను పెద్ద హీరోలు ప్రోత్సహించడం ఎంతైనా అవసరమే. అయితే అభిమానులు దాన్ని ఎప్పుడూ ఒకేలా రిసీవ్ చేసుకోరు. రకరకాల డిస్కషన్లు పెట్టేస్తారు. ఎల్లుండి విడుదల కాబోతున్న మ్యాడ్ ట్రైలర్ ని మహేష్ బాబు షేర్ చేసి శుభాకాంక్షలు చెబుతూ ఎప్పుడెప్పుడు చూడాలని ఉందాని ట్వీట్ పెట్టాడు. దీనికి కారణం లేకపోలేదు. మ్యాడ్ కోసం నిర్మాతగా మారిన సోదరి కోసం సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నాగవంశీ కోసమే మహేష్ సపోర్ట్ ఇచ్చాడని వేరే చెప్పనక్కర్లేదు. అయితే రిలీజయ్యాక హిట్ టాక్ వచ్చాక అప్పుడు ఆనందాన్ని పంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ వెర్షన్.
ఆ మధ్య మేం ఫేమస్ కి సైతం మహేష్ ఇలాగే సపోర్ట్ చేస్తే దాని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. తనతో మేజర్ లో నిర్మాణ భాగస్వాములుగా ఉన్నందుకు చాయ్ బిస్కెట్ బృందం రిక్వెస్ట్ మీద మహేష్ ఓ రెండు ముక్కలు దాని గురించి ఎక్కువే చెప్పాడు. కట్ చేస్తే బొమ్మ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సక్సెస్ మీట్లు, ఫ్రీ షోలు, మీట్ ది ప్రెస్ లు ఎన్ని పెట్టినా బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. పర్వాలేదనిపించుకుంది అంతే. ఆ మధ్య అనిల్ సుంకర నిర్మాతనే ఉద్దేశంతో భోళా శంకర్ కు సైతం మహేష్ విషెస్ చెప్పాడు. దాని ప్రతికూల ఫలితం ఊహించిందే కాబట్టి పెద్దగా హైలైట్ అవ్వలేదు.
కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు ట్వీట్ చేస్తున్నాడని అభిమానుల నుంచి మిశ్రమ స్పందన రాబడుతోంది. అసలే మ్యాడ్ లో యూత్ ఫుల్ జోకులతో పాటు కాసిన్ని డబుల్ మీనింగులు కూడా ఉన్నాయని టీజర్ లోనే హింట్ ఇచ్చారు. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ తిరిగి ఏదైనా కొంచెం తేడా కొట్టిందంటే కొంచెం ఇబ్బంది తప్పదు. గుంటూరు కారం అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి దసరా సందర్భంగా ఫస్ట్ ఆడియో సింగల్ ఎప్పుడు వస్తుందో చెప్పబోతున్నారు. అంతకు మించి ఈ నెలలో ఎలాంటి సర్ప్రైజులు ఉండకపోవచ్చు.
This post was last modified on October 4, 2023 8:53 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…