ఇవాళ హఠాత్తుగా సలార్ టీజర్ ని అప్డేట్ చేశారు. కలర్ కరెక్షన్ చేసి కొంత బ్రైట్ నెస్ పెంచడంతో పాటు ఒక మనిషి గుర్రంపై నుంచి సంకేతం ఇచ్చే షాట్ తీసేసి దాని స్థానంలో మాస్కులు వేసుకున్న సైనికులు పార్లమెంట్ లాంటి భవనంలో కవాతు చేసుకుంటూ నడిచే సన్నివేశం పెట్టారు. ఒకటిరెండుసార్లు మాత్రమే చూసినవాళ్ళు దీన్ని గురించరు కానీ వీరాభిమానులు మాత్రం ఈ తేడాని స్పష్టంగా పసిగట్టేశారు. రెండు పక్కపక్కన పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. టీజర్ చివరిలో డిసెంబర్ 22 విడుదల తేదీని జోడించారు. 134 మిలియన్ల వ్యూస్ వచ్చాక ఈ మార్పు చేయడం విశేషం.
కారణమేంటో తెలియదు కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఆ ఒక్క షాట్ ని ఎందుకు తీశారో అంతు చిక్కడం లేదు. సలార్ 2 కోసం దాచారా లేక అసలది పూర్తిగా తీసేసి వేరేది రీ షూట్ చేశారానేది సస్పెన్స్ గా ఉంది. ఫైనల్ కట్ తనకు నచ్చే వరకు రాజీ పడకుండా మార్పులు చేస్తూనే ఉంటాడని నీల్ కు పేరుంది. కెజిఎఫ్ కి సైతం బోలెడు రిపేర్లు జరిగాయి. ఇన్ని అంచనాలున్నప్పుడు సలార్ కి మాత్రం మినహాయింపు ఎందుకు ఇస్తారు. సో కంటెంట్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ రకంగా బయటపడుతున్నాయి.
అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పూర్తి లుక్ ని రివీల్ చేస్తూ ఒక కొత్త టీజర్ వదలబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. థియేట్రికల్ ట్రైలర్ ని నవంబర్ చివరి వారంలో ప్లాన్ చేశారట. ఎంత డార్లింగ్ బర్త్ డే అయినా రెండు నెలల ముందు ట్రైలర్ ఎందుకని దాన్ని కొంత ఆలస్యంగా తీసుకురాబోతున్నారు. మరోపక్క సలార్ బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. డుంకీతో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో థియేటర్ల సమస్య రాకుండా ఇండియా, ఓవర్సీస్ లో స్క్రీన్లను లాక్ చేసే పనిలో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు. టాక్ రావాలే కానీ సలార్ ఎన్ని వందల కోట్లు చేస్తుందో ఊహకందడం లేదు.
This post was last modified on October 4, 2023 8:53 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…