వయసు డెబ్భై దాటినా, నాలుగు వందల సినిమాలకు పైగా చేసినా, కొడుకు స్టార్ హీరోగా వెలుగుతున్నా అలుపు లేకుండా నటిస్తూనే ఉన్న మల్లువుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఏడాదికి కనీసం నాలుగైదు రిలీజులు ఉండేలా చూసుకుంటారు. ఎంత శ్రమ అయినా సరే లెక్క చేయకపోవడం ఆయన శైలి. సెట్స్ లో లేకపోతే తనకు అన్నం సహించదని చెప్పే తత్వం ఆయనది. మమ్ముట్టి లేటెస్ట్ మూవీ కన్నూర్ స్క్వాడ్ ఇటీవలే రిలీజయ్యింది. ముందు పెద్దగా అంచనాలు లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగా జరిగాయి. మొదటి రోజు రెండు ఆటలు పూర్తవ్వడం ఆలస్యం సీన్ మారిపోయింది.
ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. జార్జ్(మమ్ముట్టి) హెడ్డుగా వ్యవహరించే నలుగురు పోలీస్ ఆఫీసర్ల బృందం కాసర్గోడ్ అనే ఊరిలో ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో దొంగతనం కం హత్య కేసుని టేకప్ చేస్తారు. అయితే విచారణ జరిపే కొద్దీ చాలా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి. ప్రమాదాల్లో చిక్కుకుంటారు. వృత్తి, ఫ్యామిలీ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. వీళ్ళు కలిసి కట్టుగా దాన్ని ఎలా ఛేదించారనేది మెయిన్ స్టోరీ. కొంచెం కార్తీ ఖాకీ తరహా ఛాయలు అనిపించినప్పటికీ దర్శకుడు రాబీ వర్గీస్ రాజ్ తన డెబ్యూని పర్ఫెక్ట్ గా లాంచ్ చేసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈయనకు డైరెక్టర్ గా ఇదే మొదటి చిత్రం.
తెలిసిన కథలాగే అనిపించినా ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించిన తీరు విసుగు రాకుండా చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. మమ్ముట్టితో పాటు ఇతర క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్ సన్నివేశాల ఘాడతను పెంచాయి. మొదటి ఆరు రోజుల్లోనే ఒక్క కేరళ నుంచే 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిన కన్నూర్ స్క్వాడ్ వరల్డ్ వైడ్ 42 కోట్లు దాటించేసింది. సులభంగా రెండు వారాలకు పైగా స్ట్రాంగ్ గా నడుస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. తెలుగులో డబ్బింగ్ చేసినా థియేట్రికల్ గా వర్కౌట్ కాకపోవచ్చు కనక ఓటిటిలో వచ్చినప్పుడు చూడటం తప్పించి మనకు వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on %s = human-readable time difference 4:05 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…