యాంకర్ కం దర్శకుడిగా ఓంకార్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజుగారి గది మూడు సిరీస్ ల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మాన్షన్ 24తో ఓటిటి ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. డిస్నీ హాట్ స్టార్ లో అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ ట్రైలర్ ని ఇవాళ గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీని మీద ఆసక్తి కలగడానికి ఇదొక్కటే కారణం కాదు. మంచి క్యాస్టింగ్ ని సెట్ చేసుకుని ఇంటెన్స్ జానర్ లో ఓంకార్ ఈ కథను చెప్పే ప్రయత్నమే. కథను దాచకుండా రెండున్నర నిమిషాల వీడియోలో సబ్జెక్టు దేని గురించో స్పష్టంగా చెప్పేశారు.
ప్రభుత్వాధికారి కాళిదాస్(సత్యరాజ్)మీద దేశద్రోహి ముద్రపడి కనిపించకుండా పోతాడు. భార్య(తులసి)మంచాన పడితే ఆయన కూతురు(వరలక్ష్మి శరత్ కుమార్) వెతకాలని నిర్ణయించుకుంటుంది. చివరిసారిగా తండ్రి మాన్షన్ 24 బంగాళాకు వెళ్లాడని తెలుసుకుని అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రామని ఎందరు హెచ్చరించినా ధైర్యంగా అడుగు పెడుతుంది. లోపలికి వెళ్ళాక విస్తుగొలిపే విషయాలు బయట పడతాయి. అక్కడ నిజంగా దెయ్యాల జాడలు కనిపిస్తాయి. అంత పెద్ద భవంతిలో ఉన్న రహస్యం ఏమిటి, కాళిదాస్ ని ఆ అమ్మాయి కలుసుకుందా లేదానే ప్రశ్నలు సిరీస్ లోనే చూడాలి.
కామెడీ జోలికి వెళ్లకుండా ఓంకార్ చాలా సీరియస్ గా మాన్షన్ 24ని డీల్ చేశారు. అవికా గోర్, రావు రమేష్, రాజీవ్ కనకాల, నందు, బిందు మాధవి, అయ్యప్ప పి శర్మ, కాలకేయ ప్రభాకర్, విద్యుల్లేఖ రామన్, సూర్య, అమర్ దీప్, అర్చన ఇలా పెద్ద తారాగణమే ఉంది. వికాస్ బడిసా సంగీతం సమకూర్చగా రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ కనిపిస్తోంది. తనకు పట్టున్న భూత ప్రేతాల జానర్ లోనే ఓంకార్ మరోసారి మెప్పించేలానే ఉన్నాడు. బడ్జెట్ భారీగానే పెట్టారు. కంటెంట్ మొత్తం ఇలాగే భయపెట్టేలా ఉంటే డిజిటల్ లోనూ హిట్టు కొట్టినట్టే.
This post was last modified on October 4, 2023 1:54 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…