Movie News

బన్నీ కన్నా ముందు త్రివిక్రమ్ మరో సినిమా?

ప్రస్తుతం గుంటూరు కారంని సంక్రాంతి బరిలో నిలిపే లక్ష్యంతో జెట్ స్పీడ్ తో షూటింగ్ చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ లోపే మొత్తం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. మహేష్ బాబు పూర్తి సహకారంతో కావాల్సినన్ని డేట్లు ఇవ్వడంతో డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, ఆ తర్వాత ప్రమోషన్ల కోసం వాడుకునేలా పక్కా ప్లాన్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇంకా కీలకమైన పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్నప్పటికీ వాటి విషయంలోనూ జాప్యం జరగకుండా ప్రణాళిక సిద్ధం చేశారట. దీని తర్వాత ఐకాన్ స్టార్ బన్నీతో ప్యాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక్కడే తెరవెనుక కొన్ని కీలక పరిణామాలు జరిగాయని ఇండస్ట్రీ టాక్. పుష్ప 2 ది రూల్ పూర్తవ్వడానికి 2024 వేసవి వచ్చేస్తుంది. ఆగస్ట్ 15 విడుదల కాబట్టి ప్రమోషన్ల కోసం దేశం మొత్తం తిరిగేందుకు అల్లు అర్జున్ కు ఎంత లేదన్నా రెండు నెలల టైం ఇవ్వాలి. రిలీజయ్యాక కూడా హడావిడి మాములుగా ఉండదు. త్రివిక్రమ్ చూస్తే ఫిబ్రవరి నుంచి ఖాళీ అవుతారు. స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేసినా తగినంత సమయం బోలెడుంటుంది. ఈ గ్యాప్ లో ఎప్పటి నుంచో అనుకుంటున్న చిరంజీవి సినిమాని ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు సీరియస్ గానే జరుగుతున్నాయట.

డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి ఉంది. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఒకవేళ అల్లు అర్జున్ కనక పుష్ప తర్వాత తక్కువ టైంలో అట్లీతో ఓ మూవీ సెట్ చేసుకుంటూ త్రివిక్రమ్ కు మరికొంత ఎక్కువ సమయం దొరుకుతుంది. అది వృథా కాకుండా చిరుతో పని కానిచేయొచ్చు. ఇదంతా ప్రాధమిక దశలోనే ఉంది తప్ప ఇంకా ఎలాంటి నిర్ధారణలు జరగలేదు. జై చిరంజీవలో మెగాస్టార్ కోసం సంభాషణలు రాసిన మాటల మాంత్రికుడు ఇప్పుడు ఏకంగా ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే మెగా ఫ్యాన్స్ కి అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. జరగాలనే సగటు మూవీ లవర్స్ కోరిక. 

This post was last modified on October 4, 2023 12:01 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago