Movie News

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

తమిళ కథానాయకుడు సిద్దార్థ్ తన కొత్త చిత్రం ‘చిన్నా’ ప్రమోషన్ల కోసం బుధవారం హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషనల్ ప్రెస్ ఈవెంట్లో అతను చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ చిత్రానికి థియేటర్లు అడిగితే ఇవ్వలేదని.. తెలుగులో సిద్దార్థ్ సినిమాలు ఎవరు చూస్తారు అని మాట్లాడారని చెబుతూ అతను దాదాపుగా కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు.

తమిళంతో ‘చిత్తా’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్కడ ఉదయనిధి స్టాలిన్.. మలయాళం, కన్నడలో పెద్ద పెద్ద సంస్థలు రిలీజ్ చేశాయని.. కానీ తెలుగులో మాత్రం ఈ పరిస్థితి వచ్చిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే తెలుగు వాళ్లు తనకు చాలా అన్యాయం చేసినట్లు అతను మాట్లాడటం కరెక్టా అన్నది ప్రశ్న. ఒకప్పుడు మన ప్రేక్షకులు అతణ్ని ఎలా నెత్తిన పెట్టుకున్నారో అందరికీ తెలుసు. సిద్ధుకు స్టార్ ఇమేజ్ వచ్చిందే తెలుగులో. కానీ అతను ఆ ఫాలోయింగ్, మార్కెట్‌ను నిలబెట్టుకోలేకపోయాడు.

సరైన సినిమాలు చేయక మొత్తం ఫాలోయింగ్ దెబ్బ తీసుకున్నాడు. తర్వాత తమిళంలోకి వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అతను ‘మహాసముద్రం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంత గ్యాప్ తర్వాత సిద్ధు నటించాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు తల బొప్పి కట్టింది. చాలా ఏళ్ల తర్వాత సిద్ధు ఫ్యాన్స్ తన కోసమే ఈ సినిమా చూశారు. ఈ చిత్రం గురించి సిద్ధు గొప్పగా మాట్లాడాడు. తీరా చూస్తే ఆ మాటలకు.. సినిమాలో విషయానికి పొంతన లేదని తేలింది.

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో పలకరించాడు సిద్ధు. పీపుల్స్ మీడియా లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. దీని గురించి కూడా సిద్ధు గొప్పగానే చెప్పాడు. తీరా చూస్తే సినిమా చివరి వరకు కూర్చోవడం కూడా ప్రేక్షకులకు కష్టమైంది. ఇలాంటి సినిమాలు ఇచ్చి ప్రేక్షకుల నమ్మకం కోల్పోయాక.. ఇప్పుడో మంచి సినిమా చేసినా కూడా జనం థియేటర్లకు రావడం కష్టం. అందులోనూ ఈ వారం చాలా సినిమాలు రిలీజవుతున్నాయి. అలాంటపుడు థియేటర్లు దొరకడం ఈజీ కాదు. వాస్తవం ఇదైనపుడు సిద్ధు అంత ఎమోషనల్ అవడం ఏమిటో?

This post was last modified on October 4, 2023 11:57 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago