భోళా శంకర్ తర్వాత పూర్తిగా ఆత్మపరిశీలనలో పడిపోయిన మెగాస్టార్ చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో కమిటైన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టుని కూతురే నిర్మాతైనా సరే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఆపేశారనే టాక్ కూడా ఉంది. ఈ కారణంగానే కొంచెం లేట్ గా మొదలుపెట్టాలనుకున్న వశిష్ట డైరెక్షన్ లోని మెగా 157ని వేగంగా పట్టాలెక్కించే పనులు చేస్తున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేలా షెడ్యూలింగ్ జరుగుతోంది. ఈలోగా హీరోయిన్ల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంటుంది.
దీని సంగతలా ఉంచితే చిరంజీవి సుకుమార్ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని మెగా కాంపౌండ్ టాక్. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పనుల్లో బిజీగా ఉన్న సుక్కు 2024 వేసవికి ఫ్రీ అవుతారు. ఆగస్ట్ 15 సినిమా రిలీజయ్యాక ఎలాంటి టెన్షన్లు ఉండవు. తర్వాత ఏ హీరోతో చేసేది ఇంకా కమిట్ మెంట్ ఇవ్వలేదు. అది చిరుకేనని వినికిడి. ఎప్పటి నుంచో ఈ కలయిక కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సాధ్యమయ్యే ఛాన్స్ ఉందనడానికి కారణాలున్నాయి. పైకి కనిపించకపోయినా సుకుమార్ మెగాస్టార్ తో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు. గాడ్ ఫాదర్ టైంలో సుజిత్ కన్నా ముందు ఒక వెర్షన్ రాసిచ్చారు కూడా.
వాల్తేరు వీరయ్య సమయంలోనూ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. చిరు మీద సుక్కుకి అంత అభిమానం, బాండింగ్ ఉండబట్టే పుష్ప 1లో చూడాలని ఉంది రిఫరెన్స్ తో పాటు చిరంజీవి వాడకం చేసుకున్నారు. ఈ మధ్యే స్టోరీ లైన్ కి సంబంధించి చిన్న చర్చ కూడా జరిగిందట. అయితే రామ్ చరణ్ తోనూ ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్న సుకుమార్ ఒకవేళ తండ్రి కొడుకుల్లో ఒకరివైపే మొగ్గు చూపాల్సి వస్తే అది చిరునే అవుతారని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి ఇది పుకారో వాస్తవమో నిర్ధారణ లేకపోయినా నిజమయ్యేందుకు అవకాశాలను ఎంత మాత్రం కొట్టిపారేయలేం. జరగాలనే కోరుకుందాం.
This post was last modified on October 3, 2023 9:28 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…