సుషాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్య వార్త బయటకు వచ్చిన దగ్గర్నుంచీ ఎంతో కాలంగా తాను ఫైట్ చేస్తోన్న బాలీవుడ్లో నెపోటిజమ్ అంశాన్ని కంగన తీవ్ర స్థాయిలో పైకి తీసింది. సుషాంత్ మరణంతో సంబంధమే లేని కరణ్ జోహార్ లాంటి తన శత్రువులను టార్గెట్ చేస్తూ, వాళ్లనే ఈ చావుకి బాధ్యులను చేస్తూ మాట్లాడింది. మీడియా రియా చక్రవర్తిని దోషిగా చూపిస్తున్నా కానీ కంగన ఆమె గురించి ఏమీ మాట్లాడలేదు. ఆమె గురించి స్పందిస్తే తన యాంగిల్ పక్కకు పోతుందని కంగన భావించింది.
అయితే మొదట్లో కంగన వైపు వున్న వాళ్లు నెమ్మదిగా ఆమెది అజెండా బేస్డ్ వార్ అని తీర్మానించారు. ముఖ్యంగా అప్పట్లో సుషాంత్ సింగ్ రాజ్పుట్తో నటించడానికి అతనో చిన్న నటుడని కంగన రిజెక్ట్ చేసిందనే న్యూస్ ఇప్పుడు హైలైట్ అయింది. అతను బతికున్నపుడు చిన్న నటుడిగా చూసి, ఇప్పుడతని చావుని తన అజెండా కోసం వాడుకుంటోందంటూ ‘బాయ్‌కాట్ కంగన’ హ్యాష్‌టాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. రియా చక్రవర్తి గురించి ఆమె అసలు స్పందించకపోవడం కూడా ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అయితే ఎలాంటి ఆరోపణలు వచ్చినా తనదైన శైలిలో తిప్పికొట్టే కంగన వీటికి ఎలా బదులిస్తుందనేది ఆసక్తిగొలుపుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates