ఏడాది చివరి నెలలో పోటీ చూస్తుంటే మాములు రసవత్తరంగా ఉండేలా లేదు. సలార్ వచ్చి చేరాక ఇంతకు ముందు షెడ్యూల్ చేసుకున్న నిర్మాతలు కిందా మీద పడుతున్నారు. గతంలో డిసెంబర్ 15 ప్లాన్ చేసుకున్న రెండు బాలీవుడ్ సినిమాలు ఒక వారం ముందుకు జరిగి 8కే రాబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చేశాయి. ఒకటి మెర్రి క్రిస్మస్. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ కలయికలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ మీద మంచి అంచనాలున్నాయి. రెండోది సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా కరణ్ జోహార్ నిర్మించిన యోధ. ఇవి తెలుగుతో సహా ప్యాన్ ఇండియా భాషల్లో రూపొందుతున్నాయి.
ఇక తెలుగు విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ గతంలోనే ఈ డేట్ ని లాక్ చేసుకుని అనౌన్స్ మెంట్ ఇచ్చింది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి కూడా నేను సైతం అంటూ రెడీ అవుతోంది. సలార్ వల్ల డేట్ మార్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో నాని హాయ్ నాన్న డిసెంబర్ 7 గురించి సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇవన్నీ హిందీ వెర్షన్ తో సహా రిలీజయ్యేవే. అలాంటప్పుడు క్లాష్ మాములుగా ఉండదు. ప్రభాస్ రాకకు కనీసం రెండు వారాల ముందు వస్తే వసూళ్ల పరంగా ఇబ్బంది ఉండదనే కోణంలో ఇలా ప్లాన్ చేస్తున్నారు కానీ ఫైనల్ గా పరస్పర ఓపెనింగ్స్ కి దెబ్బ తప్పదు.
ఒకపక్క షూటింగులు చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఒత్తిడిలో ఉన్న దర్శక నిర్మాతలకు రిలీజ్ డేట్ల పంచాయితీ పెద్ద తలనెప్పిగా మారింది. ఒక తేదీ ప్రకటించి నిశ్చింతగా ఉండటానికి లేదు. ఏ పెద్ద హీరో ఆ డేట్ కి వస్తాడోనని టెన్షన్ తో రోజులు గడపాల్సి వస్తోంది. ఆ భయమే నిజమైతే దానికి ప్రత్యాన్మయం వెతుక్కోవడం అంతకన్నా పెద్ద సమస్యగా మారుతోంది. మాములుగా డ్రై మంత్ గా భావించే డిసెంబర్ లో ఈ స్థాయిలో తాకిడి గతంలో ఎప్పుడు లేదు. నాగార్జునకు మాత్రమే ఈ నెలలో చెప్పుకోదగ్గ హిట్లున్నాయి. చూస్తుంటే ఈసారి సెంటిమెంట్లు లెక్కలు అన్నీ మారిపోయేలా ఉన్నాయి.
This post was last modified on October 3, 2023 1:28 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…