తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో దాదాపు అందరితోను (చిరంజీవి, వెంకటేష్ మినహా) పూరి జగన్నాథ్ సినిమాలు తీసాడు. సినిమాలపై ఇష్టం కలగడానికి, దర్శకుడిగా మారడానికి కారణం చిరంజీవి అని పూరి పలుమార్లు చెబుతుంటాడు. చిరంజీవిపై పూరి అభిమానం ‘ఇడియట్’లాంటి సినిమాల్లో క్లియర్‍గా చూపించాడు. అయితే ఇంతవరకు తన ఫేవరెట్ హీరోతో పూరి సినిమా చేయలేదు. ఖైదీ నంబర్ 150 ముందు ఈ కాంబినేషన్ దాదాపు ఓకే అయినట్టే అయి కాన్సిల్ అయిపోయింది.
లాక్‍డౌన్‍లో చిరంజీవి కోసం పూరి ఒక కథ రాస్తున్నట్టు విస్తృతంగా వినిపించింది. అయితే ఇప్పుడు పూరి మలి చిత్రం నాగార్జునతో వుంటుందని మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై నాగ్ కానీ, పూరి కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. నాగార్జునకు అయితే వైల్డ్ డాగ్ కాకుండా మరో రెండు సినిమాల కమిట్‍మెంట్స్ వున్నాయి. మరి చిరంజీవి కోసం పూరి కథ రాసాడో లేదో, రాసినా వినిపించాడో లేదో తెలియదు. ఆ కథే నాగార్జునకి చెప్పి ఓకే చేయించుకున్నాడని అంటున్నారు. బహుశా నాగార్జున బర్త్ డేకి, అంటే ఆగస్టు 29కి ఈ న్యూస్‍పై కాసింత క్లారిటీ రావచ్చు.
This post was last modified on August 25, 2020 2:20 am
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…