గత ఏడాది కాలంగా మీడియం సినిమాల ప్రొడ్యూసర్లకు బాగా ఉపయోగడుతున్న ప్రమోషన్ అస్త్రం ప్రీమియర్లు. అసలు విడుదల తేదీకి ఒకటి రెండు రోజుల ముందు షోలు వేయడం వల్ల దాని తాలూకు టాక్ సోషల్ మీడియాలో వేగంగా వెళ్ళిపోయి తద్వారా ఓపెనింగ్స్ కి ఉపయోగపడుతున్నాయి. మేజర్, 777 ఛార్లీ, సామజవరగమన, మేం ఫేమస్, బేబీ లాంటివన్నీ ఈ స్ట్రాటజీ వల్ల లాభం పొందినవే. ఇదే ప్లాన్ రివర్స్ కొట్టినవి లేకపోలేదు. హిడింబ, రంగబలి, పెదకాపు 1 వగైరాలు అనవసరంగా ఈ మోడల్ జోలికి వెళ్లి దెబ్బ తిన్నాయి. మార్నింగ్ షో నుంచే నష్టపోయాయి. ఇక విషయానికి వద్దాం.
ఈ వారం 6న విడుదల కాబోయే చిత్రాల నిర్మాతలు ప్రీమియర్లు వేయాలా వద్దానే అయోమయంలో ఉన్నారు. స్కంద, చంద్రముఖి 2, పెదకాపు 1 మూడు రేపటి నుంచి డెడ్ స్లీప్ కి వెళ్లిపోతాయి. కాబట్టి కొత్త వాటికి బోలెడు స్కోప్ ఉంటుంది. మ్యాడ్ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న నాగవంశీ నాలుగో తేదీ నుంచే ప్రధాన కేంద్రాల్లో షోలు వేయడం గురించి తన టీమ్ తో చర్చిస్తున్నారు. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుధీర్ బాబు మామా మశ్చీంద్రకు హైదరాబాద్ లో మాత్రమే అయిదో తేదీ సాయంత్రం షోలు వేయాలని చూస్తున్నారు.
ఇంకా ఏవీ ఫైనల్ కాలేదు. మీడియాకు మాత్రమే వేయాలా లేక సాధారణ ప్రేక్షకులకు కూడా ఓపెన్ చేయాలానే మీమాంస తీరడం లేదట. ఆరేడు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓపెనింగ్స్ గురించి టెన్షన్ ఉంది. టాక్ చాలా కీలక పాత్ర పోషించనుంది. ఏ మాత్రం పాజిటివ్ వచ్చినా చాలు దసరాకు బాలకృష్ణ, రవితేజ, విజయ్ వచ్చేలోగా బాగా వర్కౌట్ చేసుకుని బయట పడొచ్చు. కాకపోతే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వల్ల ప్రతిదీ సవాలుగానే కనిపిస్తుంది. ఏదైనా సరే రేపు లేదా ఉదయం లోపే తేల్చేయాలి. లేదంటే డైరెక్ట్ గా రిలీజ్ రోజు కలుసుకోవడమే.
This post was last modified on October 2, 2023 11:25 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…