ఎప్పుడూ షూటింగులతో బిజీగా వుండే తెలుగు సినిమా హీరోలకు ఈ లాక్‍డౌన్‍లో తీరిక దొరకడంతో తాపీగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. లాక్‍డౌన్ ముందు వరకు బ్యాచ్‍లర్స్ కోటాలో వున్న నితిన్, రానా దగ్గుబాటి, నిఖిల్ అంతా వెడ్‍లాక్‍తో ఇంటివాళ్లయిపోయారు. త్వరలో మెగా హీరోయిన్ నిహారిక కూడా పెళ్లాడనుంది. త్వరలో మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్ హీరో కూడా పెళ్లికొడుకు అవుతున్నట్టు సమాచారం. చూడ్డానికి ఇంకా లవర్‍బాయ్‍లానే వుంటాడు కానీ శర్వానంద్‍కి మొన్న మార్చిలో ముప్పయ్యారేళ్లు నిండాయి.
అతనికి ఇక పెళ్లి చేసేయాలని పెద్దలు నిర్ణయించారట. చాలా మంది యువ హీరోల్లా శర్వానంద్‍కి లవ్‍స్టోరీస్ అవీ లేవు. బుద్ధిగా పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని చాలాసార్లు చెప్పాడు. అతనికోసం వాళ్ల పెద్దలు ఒక సంబంధం చూసినట్టు, త్వరలోనే శర్వానంద్ పెళ్లి కబురు కూడా రాబోతున్నట్టు ఫిలింనగర్‍లో గట్టిగా వినిపిస్తోంది. మరి మళ్లీ షూటింగ్స్ మొదలయ్యే లోగా శర్వానంద్ కూడా పెళ్లి బాజా మోగించేస్తాడో లేక మరికొంత కాలం తర్వాత మూడు ముళ్లు వేస్తాడో చూడాలి. ఏదేమైనా ఈ లాక్‍డౌన్ వేళ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం రాఘవేంద్రరావు ‘పెళ్లిసందడి’ సినిమాలా కళకళలాడిపోతోంది.
This post was last modified on August 25, 2020 1:59 am
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…