తీసింది నాలుగు సినిమాలు. అందులో ఒకటి బ్లాక్‌బస్టర్. ఒకటి సూపర్ హిట్. ఒకటి యావరేజ్. ఇంకోటి మాత్రం డిజాస్టర్. మొత్తంగా చూసుకుంటే ఇది మంచి ట్రాక్ రికార్డే. అయినా సరే.. ఇప్పుడు తర్వాత ఏ సినిమా చేయాలో తెలియక క్రాస్ రోడ్స్‌లో నిలబడ్డాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రెండో చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా బాగా ఆడింది.
‘నేల టిక్కెట్టు’ తేడా కొట్టినా.. ‘బంగార్రాజు’తో పర్వాలేదనిపించాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చిందని ఎంతో ఆనందించాడు కళ్యాణ్. ‘బ్రో డాడీ’ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీసే బాధ్యతను చిరు అతడి చేతిలో పెట్టాడు. ముందు అనుకున్న ప్రకారం అయితే.. ఈ పాటికి ఈ సినిమా షూట్ మొదలైపోయి ఉండాలి. సంక్రాంతి లక్ష్యంగా టీం ముందడుగు వేస్తుండాలి. కానీ ‘భోళా శంకర్’ రిజల్ట్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. ఈ సినిమాను చిరు హోల్డ్‌లో పెట్టేశాడు.
ముందేమో స్క్రిప్టు మీద మళ్లీ పని చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత చూస్తే రీమేక్ సినిమాల పట్ల జనాల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుని చిరు పూర్తిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. 157వ సినిమాగా చేయాల్సిన వశిష్ఠ మూవీనే ముందుకు తీసుకొచ్చి 156వ సినిమాగా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కళ్యాణ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను పూర్తిగా అటకెక్కించేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ స్థితిలో ఒక సినిమా క్యాన్సిల్ అయితే అది దర్శకుడికి చాలా చెడ్డ పేరు తెస్తోంది. ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా ఖాళీగా లేడు. కళ్యాణ్‌కు క్రియేటివ్, ట్రెండీ డైరెక్టర్‌గా పేరు లేదు. చిరుతో సినిమా చేస్తే.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా కెరీర్ బాగుండేది. కానీ ఇప్పుడు చిరు సినిమానే క్యాన్సిల్ కావడంతో కళ్యాణ్ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఈ స్థితి నుంచి అతను ఓ మోస్తరు స్టార్‌తో కూడా సినిమా ఓకే చేయించుకోవడం కష్టంగా మారేలా ఉంది. సొంత బేనర్లో కళ్యాణ్‌తో మూడు సినిమాలకు అవకాశమిచ్చి మంచి ఫలితాలే అందుకున్న నాగ్ సైతం అతడికి ఛాన్సివ్వడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on October 2, 2023 5:46 pm
వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…
రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…
మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…
ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…