కరోనా లాక్‍డౌన్ వల్ల అతిగా నష్టపోయిన సినిమా ఏదైనా వుందంటే అది రాజమౌళి తీస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’. అన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతోన్న ఈ చిత్రానికి ఫైనాన్స్ పై వడ్డీ భారంతో పాటు అంత మంది ఆర్టిస్టుల డేట్స్ మళ్లీ సాధించడం అన్నిటికంటే పెద్ద కసరత్తు. షూటింగ్ మళ్లీ ఎప్పటికి మొదలవుతుందనేది తెలియదు కానీ, ఎప్పుడు స్టార్ట్ అయినా ముందుగా కాంబినేషన్ అవసరం లేని ఎన్టీఆర్ సీన్లను చిత్రీకరిస్తారట. అటు తారక్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ వుండడంతో ముందుగా తారక్ పని పూర్తి చేసి పంపించక తప్పదు. అంటే షూటింగ్స్ మళ్లీ మొదలయినా కానీ చరణ్ ఖాళీగానే వుండాలన్నమాట.
అందుకే ఈలోగా ‘ఆచార్య’ చిత్రం కోసం చరణ్ చేయనున్న ఎపిసోడ్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఎలాగో ‘ఆర్.ఆర్.ఆర్.’ చరణ్ మార్చుకున్న గెటప్ ఇప్పుడు లేదు కనుక కంటిన్యుటీ సమస్యలు కానీ, ఈ గెటప్ ఇంకో చోట రిపీట్ అయిందనే ఇబ్బందులు కానీ రావు. అందుకే ఆచార్య కోసం ముప్పయ్ రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్‍లో జాయిన్ అవ్వాలని చరణ్ నిర్ణయించుకున్నట్టు, అందుకు రాజమౌళి కూడా అనుకూలంగానే స్పందించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇలా తారుమారు తక్కెడ మారు గొడవ వుండేది కాదు కానీ ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోక తప్పదు.
This post was last modified on August 25, 2020 2:04 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…