Movie News

రష్మిక మాస్ చూడబోతున్నాం

టాలీవుడ్లో చాలా వేగంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ల సరసన సినిమాలు చేసింది రష్మిక మందన్నా. కానీ ఈ మధ్య ఉన్నట్లుండి డౌన్ అయినట్లు కనిపించింది. ‘పుష్ప-2’ మినహా ఆమె చేతిలో ఏ పెద్ద సినిమా లేదు ఒక దశలో. కొంతకాలం పాటు ఆమె పేరే ఇండస్ట్రీలో వినిపించని పరిస్థితి నెలకొంది.

ఓవైపు నితిన్ సినిమాను డేట్ల సమస్యతో వదులుకుంటే.. ఏ హిందీ సినిమా కోసం నితిన్ మూవీని వదులుకుందో ఆ చిత్రం క్యాన్సిల్ అయిపోవడంతో రష్మికకు ఎటూ పాలుపోని పరిస్థితి తయారైంది. పూజా హెగ్డే లాగా సడెన్‌గా ఫేడవుట్ అయిపోతుందేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ రష్మిక జాగ్రత్తగా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంది. కొన్ని క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ డిసెంబరు నుంచి రష్మిక మాస్ చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

‘యానిమల్’ సినిమా టీజర్ రిలీజయ్యాక దీని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్లో ఇప్పటికే రెండు సినిమాలు చేసినా రష్మికకు సరైన గుర్తింపు రాలేదు. కానీ ‘యానిమల్’ బ్లాక్ బస్టర్ కాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రష్మికది స్పెషల్ క్యారెక్టర్ అనే అంటున్నారు. ఈ సినిమా రిలీజైన కొంత కాలానికే రష్మిక లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘రెయిన్‌బో’ సౌత్ ప్రేక్షకులను పలకరించబోతోంది. జనవరి నెలాఖర్లో లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజవుతుంది. ఇక ఏడాది మధ్యలో ‘పుష్ప-2’ సందడి ఉంటుంది. ఈ సినిమాకు హైప్ మామూలుగా లేదు.

మరోసారి రష్మిక పేరు మార్మోగడం ఖాయం. కొత్తగా ఆమె విజయ్ దేవరకొండతో జట్టు కడుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఆ చిత్రం వేసవి చివర్లో రిలీజవుతుందని అంటున్నారు. విజయ్-రష్మిక కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. మరోవైపు ధనుష్ సరసన శేఖర్ కమ్ముల సినిమాలోనూ రష్మిక నటించనుంది. ఇంకా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేయబోతోంది. కాబట్టి వచ్చే రెండేళ్లలో రష్మిక ఊపు మామూలుగా ఉండదన్నది స్పష్టం.

This post was last modified on October 1, 2023 9:32 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

54 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

4 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

14 hours ago