గత కొంత కాలంగా వెబ్ సిరీస్ ల దూకుడు తగ్గిపోయింది. రెగ్యులర్ గా వస్తున్నాయి కానీ యునానిమస్ గా బాగున్నాయని అనిపించుకున్నవి పెద్దగా లేవు. అయితే నిత్య మీనన్ కుమారి శ్రీమతి మీద మాత్రం మంచి అంచనాలే నెలకొన్నాయి. స్వప్న సినిమా నిర్మాణ భాగస్వామ్యం కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో దీని మీద గురి కుదిరింది. సాఫ్ట్ ఎమోషన్స్ రాయడంలో దిట్టగా పేరున్న అవసరాల శ్రీనివాస్ రచనలో గోమరేష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో డీసెంట్ బడ్జెట్ లో దీన్ని రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్ తో సుమారు నాలుగు గంటలకు పైగా నిడివున్న ఈ కూల్ ఎంటర్ టైనర్ ఎలా ఉందంటే
రామరాజులంకలో ఉండే శ్రీమతి ఉరఫ్ సిరి(నిత్య మీనన్)కి తాతల నాటి ఇంటిని బాబాయ్ నుంచి స్వంతం చేసుకునేందుకు కోర్టు తీర్పు ప్రకారం 38 లక్షలు అవసరమవుతాయి. అయితే ఆరు నెలలు మాత్రమే టైం ఉంటుంది. తనకొచ్చే పదమూడు వేల జీతంతో ఇది సాధ్యం కాదని బార్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. దీనికి పొరుగింటబ్బాయి(నిరుపమ్)తో పాటు మరో ఇద్దరు స్నేహితులు(తిరువీర్-శ్రీనివాస్ గవిరెడ్డి) సహాయం చేస్తారు. అయితే అనుకున్నంత సులభంగా వ్యవహారం జరగదు. బార్ పెట్టాక శ్రీమతికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటిని తట్టుకుని విజయం సాధించడమే అసలు కథ.
ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబం మొత్తం చూసేలా శ్రీమతి కుమారిని తీర్చిదిద్దారు. సిరీస్ కాబట్టి సహజంగానే కొంత ల్యాగ్, రిపీట్స్ ఉన్నప్పటికీ మరీ ఇబ్బంది పెట్టే స్థాయిలో లేవు. పాత్రల రూపకల్పన, సంభాషణలు నీట్ గా సాగాయి. అయితే శ్రీమతితో మద్యం వ్యాపారం పెట్టించే ఐడియా వెరైటీగా ఉంది కానీ ఇలాంటి హోమ్లీ కాన్సెప్ట్స్ లో సింక్ అవ్వడం కొంత ఇబ్బందే. నిత్య మీనన్ వన్ విమెన్ షోతో నడిపించేసింది. మిగిలిన ఆర్టిస్టులు బాగా చేశారు. న్యాచురల్ స్టార్ నాని సర్ప్రైజ్ బాగుంది. సంగీతం, ఛాయాగ్రహణం తదితర విభాగాలు చక్కని క్వాలిటీకి తోడ్పడ్డాయి. హెచ్చుతగ్గులున్నా కుమారి శ్రీమతి మంచి కాలక్షేపమే.
This post was last modified on September 30, 2023 9:58 pm
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన…
నారా చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు.. ఏ విషయంలో ఎంతదాకా స్పందించాలో తెలిసిన నేత. ఏ విషయంలో…
కాంగ్రెస్ పాలనలో కేవలం ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గణతంత్ర…
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ మంత్రిని పలకరించినా..…