దసరా పోటీ అంటే మనమేదో బాలయ్య, రవితేజ, విజయ్ ల మధ్యే అనుకుంటున్నాం కానీ తాజాగా నేనున్నా అంటూ గుర్తు చేస్తున్నాడు బాలీవుడ్ హీరో టైగర్ శ్రోఫ్. అతను హీరోగా రూపొందిన గణపథ్ భారీ ఎత్తున తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ టీజర్ వచ్చింది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ స్కై ఫై థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించారు. నిమిషంన్నర టీజర్ లో కాన్సెప్ట్ ఏంటో చెప్పారు. యాభై సంవత్సరాల తర్వాత 2070 ADలో జరిగే కథగా దర్శకుడు వికాస్ బహ్ల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
విజువల్స్ గట్రా బాగానే ఉన్నాయి. ఏదో సరికొత్త ప్రపంచంలో తీసుకెళ్లబోతున్న ఫీలింగ్ కలిగించారు. ఎప్పటిలాగే టైగర్ బాబు బ్రాండ్ ఫైట్లు, పోరాట దృశ్యాలు పెట్టారు. అయితే భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ఒక సూపర్ హీరో ఎదురుకోవడమనే కాన్సెప్ట్ తోనే ప్రభాస్ కల్కి 2898 రూపొందుతోంది. దానికి కొంచెం దగ్గరగా గణపథ్ ఉందనిపిస్తోంది. బడ్జెట్, క్యాస్టింగ్, క్వాలిటీ, విఎఫెక్స్ లాంటి విషయాల్లో కల్కితో దగ్గరగా వెళ్లడం కూడా జరిగే పని కాదు కానీ మొత్తానికి చర్చకైతే దారి తీసింది. దీనికి నూటా యాభై కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందని ముంబై వర్గాలు ఉటంకిస్తున్నాయి.
ఇప్పుడీ గణపథ్ వల్ల సౌత్ లో మనకొచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండవు కానీ టైగర్ నాగేశ్వరరావు, లియోలకు బయట మార్కెట్లలో థియేటర్ల పరంగా సమస్య రావొచ్చు. భగవంత్ కేసరి తెలుగు వెర్షన్ కే పరిమితం చేయబోతున్న నేపథ్యంలో టెన్షన్ లేదు. మాస్ లో మంచి గ్రిప్ ఉన్న టైగర్ శ్రోఫ్ ఈ గణపథ్ తో టాప్ లీగ్ లోకి చేరతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పెద్దగా గుర్తింపు లేకపోయినా అదే పనిగా తెలుగు డబ్బింగ్ కూడా చేస్తున్నారంటే ఇదంతా జవాన్, పఠాన్ లాంటి సినిమాలు ఇచ్చిన ధైర్యమే అనుకోవాలి. చూడాలి కంటెంట్ ఏ మేరకు మెప్పిస్తుందో.
This post was last modified on September 29, 2023 9:13 pm
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…
కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ…
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు,…
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు…