గత ఏడాది ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే చిన్న సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఆ చిత్రం థియేటర్ల నుంచి అంతకు 20 రెట్లకు పైగా ఆదాయం తెచ్చుకుంది. కశ్మీర్లో హిందూ పండిట్ల మీద ముస్లింలు జరిపిన ఊచకోత నేపథ్యంలో హార్డ్ హిట్టింగ్‌గా ఈ సినిమా తీశాడు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ సినిమా తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దాన్ని నెత్తిన పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ సినిమాను ప్రమోట్ చేయడం గమనార్హం. అలా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అసాధారణ విజయం సాధించింది. ఈ ఊపులో వివేక్ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాను అనౌన్స్ చేశాడు. చకచకా పూర్తి చేసి నిన్ననే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
‘కశ్మీర్ ఫైల్స్’ లాగే ‘వ్యాక్సిన్ వార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తుందని వివేక్ అనుకున్నాడు. కానీ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం లేవు. హిందీ సహా పలు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ఇతర భాషల్లో దీనికి అసలు టేకర్స్ లేరు. తెలుగు వెర్షన్ రిలీజే కాలేదు. హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో హిందీ వెర్షన్‌కు కొన్ని షోలు ఇచ్చారు.
అవి జనాలు లేక వెలవెలబోతున్నాయి. థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. హిందీలో కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేదు. రివ్యూయర్లు ఈ సినిమాకు పెయిడ్ ప్రమోషన్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. వాళ్లెంతగా సినిమాను లేపినా.. జనాలకు మాత్రం దీని మీద ఆసక్తి లేనట్లే ఉంది. మొత్తంగా చూస్తే ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి మ్యాజిక్స్ అన్నిసార్లూ జరగవని.. ‘వ్యాక్సిన్ వార్’కు బాక్సాఫీస్ దగ్గర పరాభవం తప్పదని అర్థమవుతోంది. ఇలాంటి సినిమాతో ‘సలార్’ను కొట్టేస్తానని వివేక్ ప్రగల్భాలు పలకడం గమనార్హం.
This post was last modified on September 29, 2023 12:42 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…