జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ దేవరను నెట్ ఫ్లిక్స్ సంస్థ అన్ని బాషలకు కలిపి భారీ మొత్తానికి డీల్ చేసుకుందన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఫిగర్ ఎంతనేది బయటికి రాలేదు. అంతర్గత సమాచారం మేరకు దేవరను సదరు ఓటిటి కంపెనీ 90 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇది పెద్ద మొత్తమే. అధికారికంగా చెప్పలేదు కానీ లీకైన సోర్స్ ని బట్టి తెలిసింది. అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు.
దేవర బడ్జెట్ ప్లస్ క్యాస్టింగ్ రెండింటిపరంగా పెద్ద స్కేల్ దక్కింది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లు హిందీ మార్కెట్ కి అదనంగా ఉపయోగపడుతుండగా జూనియర్ వ్యక్తిగత ఇమేజ్ అన్ని బాషలకు బాగా పని చేస్తోంది. ఆచార్య తాలూకు ప్రభావం కొరటాల శివ బ్రాండ్ కి పెద్దగా డ్యామేజ్ చేయలేదు. సెట్లను దగ్గర నుంచి చూసి నిర్మాణ విశేషాలు తెలుసుకుంటున్న వాళ్ళు చెబుతున్న ప్రకారం దేవర ఊహించనంత భారీగా ఉండబోతోంది. కేవలం తారక్ ఇంట్రో ఎపిసోడ్ నే ఇరవై రోజుల పాటు షూట్ చేశారంటే ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవర రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆ మేరకు తారక్, శివ ఇద్దరూ కట్టుబడి దానికి అనుగుణంగానే షూట్ చేస్తున్నారు. జనవరిలో సంక్రాంతికి టీజర్ వదిలి. ఫిబ్రవరిలో ట్రైలర్, మార్చి చివరి వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం ద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా సెట్ చేస్తున్నారు. ఎనిమిది వారాల థియేట్రికల్ గ్యాప్ తో ఓటిటిలో వచ్చేలా దేవర అగ్రిమెంట్ జరిగిందట. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న దేవరకు ఇంకా అతని పని మొదలు కావాల్సి ఉంది. వచ్చే నెల మ్యూజిక్ సిట్టింగ్స్ ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.
This post was last modified on September 29, 2023 10:15 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…