బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ‘భగవంత్ కేసరి’ వచ్చే నెల అక్టోబర్ 19 న థియేటర్స్ లోకి రానుందని ఇప్పటికే టీం పదే పదే చెప్తున్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అప్పటి నుండే అదే డేట్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితిలు చూస్తుంటే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. డానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది.
బావ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ప్రస్తుతం బాలయ్య పొలిటికల్ గా బిజీ అయ్యారు. పార్టీ కార్యకర్తలతో నిత్యం చర్చలు జరుపుతూ ఉన్నారు. చంద్ర బాబు నాయుడుకి బెయిల్ తీసుకురావాలని పార్టీలో అందరూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు జైలుకి వెళ్ళి చాలా రోజులైంది. భగవంత్ కేసరి రిలీజ్ కి ఇంకా 20 రోజులే ఉంది. బాలయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రమోషన్స్ కి రావడం కష్టమే.
బావ జైలులో ఉంటే తన సినిమా రిలీజ్ అనేది రాజకీయంగా బాలయ్యను ఇబ్బంది పెట్టేది. త్వరలో బాబు కి బెయిల్ వస్తే పర్లేదు లేదంటే భగవంత్ కేసరి వెనక్కి వెళ్ళడం ఖాయమని అంటున్నారు. ఇండస్ట్రీలో వాయిదా న్యూస్ వినిపించడంతో మేకర్స్ అలర్ట్ అయి మేకింగ్ వీడియో వదిలి మళ్ళీ రిలీజ్ డేట్ ను గుర్తుచేశారు. అయితే చంద్రబాబు కి బెయిల్ రాకపోతే మాత్రం ఈ సినిమా రిలీజ్ ప్రకటించిన దసరాకి ఉండదని కొందరు బాలయ్య సన్నిహితులు చెప్తున్నారు.
This post was last modified on September 28, 2023 10:00 pm
సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…