భారతీయుడు, ఠాగూర్ సినిమాల్లో లంచం తీసుకోవడం ఎంత పెద్ద తప్పో వివరించి దాని కట్టడి చేయడం కోసం హత్యలు చేసినా పర్వాలేదనే రేంజ్ లో సందేశం ఇస్తారు కమల్ హాసన్, చిరంజీవిలు. అయితే ఇలాంటివి కేవలం తెరకే పరిమితం. నిజ జీవితంలో హీరోలకు అలాంటి పరిస్థితి వచ్చినా తప్పించుకోలేరని తాజా ఉదంతం చాటుతోంది. హీరో విశాల్ తన లేటెస్ట్ తమిళ హిట్ మార్క్ ఆంటోనీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం అక్షరాలా 6 లక్షల 50 వేల రూపాయలు ముంబై అధికారులకు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పిన వీడియో వైరలవుతోంది.
ఇదంతా ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి సెన్సార్ క్లియరెన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, తప్పనిసరి పరిస్థితుల్లో పని జరిగాక బయట పెడుతున్నానని వివరాలు అందజేశారు. స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికెట్ కోసం 3 లక్షల 50 వేలు సమర్పించుకున్నాడు. అప్పటికే హిందీ డబ్బింగ్ కోసం ఒత్తిడి ఉండటంతో ఇవ్వాల్సి వచ్చింది. ఎం రాజన్, జీజ రాందాస్ పేరు మీద అకౌంట్ వివరాలు కూడా విశాల్ మీడియాకు విడుదల చేశాడు. ప్రధాన మంత్రి ఇలాంటివి సీరియస్ గా తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరూ తనలా ఇబ్బంది పడకూడదని అన్నాడు.
నిజంగా ఇది షాక్ కలిగించే విషయమే. పెద్ద హీరోలు కాబట్టి వాళ్లకు తగినంత గౌరవ మర్యాదలతో పాటు ఎలాంటి లంచాల బెడద ఉండదనుకుంటే ఇండస్ట్రీలోనే పీడించుకునే వాళ్ళు ఉండటం విచారకరం. అది కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులలో. విశాల్ ఇలా నిక్కచ్చిగా వివాదాలు బయటికి తేవడం ఇది మొదటిసారి కాదు. చాలా ఏళ్ళ క్రితం చెన్నైలో రోడ్డు మీద పైరసీ అమ్ముతున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సంచలనం రేపాడు. ఇప్పుడీ ఇష్యూ. అయినా ఈ సంఘటనలు వినేసి ఊరుకుంటాం కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావన్న గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు ఇవ్వలేరు.
This post was last modified on September 28, 2023 8:14 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…