కొన్ని రోజులుగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఒక చిత్రం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఆ సినిమానే.. ఆదిపురుష్. ఈ ఏడాది ఇండియాలో అతి పెద్ద హిట్‌గా నిలిచిన ‘తానాజీ’ని రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. మన ప్రభాస్ హీరోగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇది భారతీయ హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కనుండటం, శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండటం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు. ఐతే ‘తానాజీ’తో ఫేమ్ సంపాదించిన ఓం రౌత్.. ఆ సినిమా చేయడానికంటే ముందే ‘ఆదిపురుష్’ కథ రాశాడట. ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకునే ప్రధాన పాత్రను తీర్చిదిద్దాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు ఓం రౌత్.
‘‘తానాజీ’ సెట్స్‌పైకి వెళ్లక ముందు నుంచే నా మదిలో ‘ఆది పురుష్’ ఆలోచన వచ్చింది. చాలా పరిశోధన చేసి, ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసుకున్నా. నా టీంకు ఈ కథ చెప్పగానే వాళ్లు చాలా ఎగ్జైట్ అయ్యారు. రెండు నెలల పాటు అందరం కూర్చుని ఆ రఫ్ డ్రాఫ్ట్‌ను తిరగరాశాం. స్క్రీన్‌ప్లేను అప్‌డేట్ చేశాం. కథా వస్తువులో మార్పులు లేనప్పటికీ దాన్ని ఎగ్జిక్యూషన్ మాత్రం కొత్తగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా కథను నవీకరించాం. లాక్‌డౌన్ ఎత్తేశాక ఈ మధ్యే ప్రభాస్‌ను కలిసి కథ వినిపించా. ప్రభాస్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతాడని నాకు అనిపించింది. అతడి పర్సనాలిటీ, ప్రశాంత చిత్తం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు.. ఇలా ‘ఆదిపురుష్’లో ప్రధాన పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలూ అతడిలో చూశాను. ప్రభాస్ ఒప్పుకోకుంటే ఈ సినిమా చేసేవాడినే కాదు. ఇది శ్రీరాముడి కథ అన్నది నిజం. కానీ రామాయణాన్ని పూర్తిగా చూపించాం. అందులో ఇది ఒక భాగం. చారిత్రక కోణం నుంచి ఇప్పటికే దీనిపై పరిశోధన పూర్తి చేశాం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అని రౌత్ తెలిపాడు.
This post was last modified on August 24, 2020 4:49 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…