భారతదేశపు స్పిల్బర్గ్ గా చెప్పుకునే దర్శకుడు శంకర్ ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం పెద్ద తలనెప్పిగా మారింది. ఇండియన్ 2 వల్ల కమల్ హాసన్ కు ఇబ్బంది లేదు కానీ గేమ్ చేంజర్ లేట్ అవ్వడం రామ్ చరణ్ ప్లానింగ్ మీద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దాదాపు మూడేళ్లు గడిచిపోయాయి. టైటిల్ అనౌన్స్ మెంట్ తప్ప నెలల తరబడి ఎలాంటి అప్డేట్ లేదు. లీకైన సాంగ్ విని అభిమానులు సంతోషపడటం తప్పించి పబ్లిసిటీ పరంగా మూడు వందల కోట్ల సినిమా బాగా వెనుకబడి ఉన్న మాట వాస్తవం. ఇక్కడి దాకా అందరికి తెలిసిన విషయాలే కాబట్టి అసలు మ్యాటర్ కు వద్దాం.
ఇండియన్ 2 తర్వాత మూడో భాగం కూడా శంకర్ మనసులో ఉంది. ముందు కమల్ ఒప్పుకోలేదు కానీ పలు దఫాల చర్చల అనంతరం అంగీకారం తెలిపినట్టు చెన్నై టాక్. ఎలాగూ క్యాస్టింగ్ అందుబాటులో ఉంది కనక కెజిఎఫ్, బాహుబలి లాగా తర్వాత తీయకుండా ఒకేసారి పూర్తి చేసేద్దామనే ప్రతిపాదన డిస్కషన్ లో ఉందట. ఒకవేళ అంతా ఓకే అనుకుంటే ఇండియన్ 3 గుట్టుచప్పుడు కాకుండా మొదలుపెట్టేస్తారు. అదే జరిగితే గేమ్ చేంజర్ కు ఇంకో కొత్త సమస్య వస్తుంది. 2024 సంక్రాంతి చేజారింది. వేసవికి గ్యారెంటీ లేదు. దసరా దీపావళిలకి వర్క్ అవుట్ కాదు.
ఫైనల్ గా 2025 జనవరికి గేమ్ చేంజర్ ఉండొచ్చనే ప్రచారం మెగా పవర్ స్టార్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ తదితరాలు చాలా ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు సైతం ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఫలానా సీజన్ లో వస్తుందని చెప్పేస్తే ఈ టెన్షన్ ఉండదు. బాల్ శంకర్ కోర్టులో ఉన్నప్పుడు వట్టి బ్యాటుతో రాజు గారు మాత్రం ఏం చేయగలరు. గేమ్ చేంజర్ పూర్తయితే బుచ్చిబాబు సినిమా మీద సీరియస్ ఫోకస్ పెట్టేందుకు చరణ్ కు అవకాశం దక్కుతుంది. కానీ అంతులేని కథలా శంకర్ రెండు పడవల ప్రయాణానికి ఆది తప్ప అంతం కనిపించడం లేదు.
This post was last modified on September 27, 2023 10:55 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…