ఒక దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషల్లో కథానాయిక టాప్ హీరోయిన్‌గా కొనసాగింది తమన్నా. రెండు చోట్లా పెద్ద స్టార్లందరితోనూ నటించింది. కానీ ఎంత హవా సాగించిన హీరోయిన్ అయినా ఏదో ఒక దశలో రేంజ్ తగ్గించుకోవాల్సిందే. తమన్నా కూడా అందుకు మినహాయింపు కాదని తేలిపోయింది.
గత కొన్నేళ్లలో ఆమె తన స్థాయిని బాగా తగ్గించుకుని నందమూరి కళ్యాణ్ రామ్, సందీప్ కిషన్ లాంటి హీరోలతో నటించింది. ఇప్పుడు ఇంకా హీరోగా నిలదొక్కుకోని సత్యదేవ్‌తో జోడీ కట్టేందుకు రెడీ అయిపోయింది. టాలెంట్ విషయంలో సత్యదేవ్ ఎవరికీ తీసిపోకపోయినా.. సోలో హీరోగా ఇప్పటిదాకా హిట్టు కొట్టలేదు. తనకంటూ మార్కెట్ సంపాదించుకోలేదు. ఈ మధ్యే నేరుగా ఓటీటీలో రిలీజైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అతడికి కాస్త ఉపశమనాన్ని అందించింది. కానీ థియేటర్లలో సినిమా ఆడితేనే హీరోకు మైలేజ్ వచ్చేది.
ఆ మైలేజ్ ఓ రీమేక్ లవ్ స్టోరీ అందిస్తుందని సత్యదేవ్ ఆశిస్తున్నాడు. తమన్నాతో కలిసి అతను కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’ రీమేక్‌లో నటించనున్నట్లు కొన్ని రోజుల కిందటే అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ కూడా ఖరారు చేశారు.
‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని నాగశేఖర్ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు. అతనే నిర్మాత కూడా. భావన రవి మరో ప్రొడ్యూసర్. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చనున్నాడు.
టాలీవుడ్లో నెమ్మదిగా మళ్లీ షూటింగులు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. కన్నడలో ఈ ఏడాది జనవరి 31న విడుదలైన ‘లవ్ మాక్‌టైల్’ సూపర్ హిట్టయింది. కృష్ణ అనే యువ నటుడు తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.
This post was last modified on August 24, 2020 2:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…