సలార్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 29న రిలీజవుతున్నట్లయితే ఈ పాటికి సినిమా ప్రేమికులు ఆ ఫీవర్‌తో ఊగిపోతుండేవాళ్లు. కానీ ఆ సినిమా వాయిదా పడిపోయింది. అలా అని సలార్ వార్తల్లో లేకుండా ఏమీ లేదు. వాయిదా వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సలార్ మీద ప్రతి రోజూ చర్చ నడుస్తూనే ఉంది. ఈ మధ్య కొంచెం సౌండ్ తగ్గినట్లు కనిపించినా.. క్రిస్మస్ రిలీజ్ అనే అప్‌డేట్ బయటికి రావడంతో మళ్లీ వేడి రాజుకుంది. దీని మీద చర్చోప చర్చలు నడుస్తున్నాయి.
షారుఖ్ ఖాన్ సినిమా డుంకి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ వాళ్లకు సలార్ పోటీకి రావడం అస్సలు రుచించడం లేదు. ఈ విషయమై షారుఖ్ ఖాన్, ప్రభాస్ అభిమానుల మధ్య ట్విట్టర్లో యుద్ధాలు నడుస్తున్నాయి. మరోవైపు సలార్ క్రిస్మస్‌కు వచ్చేట్లయితే తమ పరిస్థితి ఏంటని సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ టీమ్స్ ఆలోచనలో పడ్డాయి. ఇప్పటికే ప్రత్యామ్నాయాల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐతే సలార్ పక్కాగా క్రిస్మస్‌కు వస్తుందా రాదా అన్నదే ఇంకా క్లారిటీ లేదు. కొందరేమో సలార్ టీం గ్యాంబ్లింగ్ చేస్తోందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సలార్ రిలీజ్‌కు సంబంధించి వేర్వేరు డేట్ల విషయంలో కొన్ని లీక్స్ వచ్చాయి. చివరగా జరిగిన ప్రచారం ప్రకారమే మార్చిలో వచ్చేట్లయితే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఫ్యాన్స్ మాత్రం అంత లేటా అని డిజప్పాయింట్ అయ్యేవాళ్లు. ఐతే రకరకాల ప్రత్యామ్నాయాలు పరిశీలించి చివరికి క్రిస్మస్ మీద కన్నేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ డేట్‌కు రావడం వల్ల చాలామందికి ఇబ్బంది తప్పట్లేదు.
ఇలా ఆలస్యంగా వచ్చి క్రిస్మస్ మీద కర్చీఫ్ వేయడం అన్యాయం అని సలార్ టీం మీద ఇండస్ట్రీ వాళ్లే ఆగ్రహంతో ఉన్నారు. ఇంత పెద్ద సినిమాకు రిలీజ్ ప్లానింగ్ ఇలాగేనా చేసేది అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాయిదా గురించి కానీ, కొత్త డేట్ గురించి కానీ అధికారికంగా ప్రకటన ఇవ్వకుండా ఇలా దాగుడు మూతలు ఆడటం.. లీక్స్ ఇచ్చి వినోదం చూడటం పట్ల ఇండస్ట్రీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జనాలు కూడా ఈ కన్ఫ్యూజన్ విషయంలో అసహనంతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారికంగా, అందరూ కన్విన్స్ అయ్యేలా సాధ్యమైనంత త్వరగా ఓ ప్రకటన చేస్తే మంచిదేమో.
This post was last modified on September 26, 2023 11:41 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…