టాలీవుడ్ యువ కథానాయకుడు ఓ మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అతడి సినిమాలు కొన్ని ప్రామిసింగ్‌గా కనిపించినా.. అతడికి నిరాశనే మిగిల్చాయి. తమిళ చిత్రం ‘మైకేల్’తో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే అది కూడా డిజాస్టరే అయింది. ఐతే అంతకుముందు తమిళంలో కొన్ని మంచి సినిమాలు చేయడంతో సందీప్‌కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.
ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’లో అతనో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ‘మాయవన్’ సీక్వెల్ మొదలైంది. సందీప్ కెరీర్లో ది బెస్ట్ అనదగ్గ సినిమా ‘మాయవన్’. తమిళంలో ఒకప్పుడు నిర్మాతగా చాలా బిజీగా ఉన్న సీవీ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రేక్షకులను ఆరంభం నుంచి చివరి వరకు గెస్సింగ్‌లో ఉంచే ఒక ఉత్కంఠభరిత థ్రిల్లర్ కథతో తెరకెక్కిందీ సినిమా.
ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు సందీప్ ఈ సినిమాలో. కిల్లర్ చేసే సీరియల్ హత్యలకు సంబంధించి ఒక సంచలన విషయం తెలుస్తుంది. ఆ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ‘మాయవన్’ తమిళంలో పెద్ద హిట్టయింది. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తెలుగులోకి ‘ప్రాజెక్ట్-జడ్’ పేరుతో అనువాదమైంది.
కొంచెం లేటుగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆరేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టారు సందీప్, సీవీ కుమార్. థ్రిల్లర్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కడం తక్కువే. ‘మాయవన్’ లాంటి ఎగ్జైటింగ్ థ్రిల్లర్‌కు సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనడం విశేషం. అప్పుడు తమిళ సినిమాగానే తెరకెక్కింది కానీ.. ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇంకా ప్రకటించలేదు.
This post was last modified on September 26, 2023 6:20 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…