సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో బ్రహ్మోత్సవం ఒకటి. తనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి స్పెషల్ ఫిలిం ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలతో కొన్నేళ్లకే మళ్లీ జట్టు కట్టాడు మహేష్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కనీస స్థాయిలో కూడా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. టాలీవుడ్ చరిత్రలోనే ఆ సమయానికి అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా మీద సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఇది మహేష్‌కు అవమాన భారం మిగిల్చిందని చెప్పొచ్చు. ఇలాంటి డిజాస్టర్ ఇచ్చాక ఎవరికైనా దర్శకుడి మీద కోపం రావడం సహజం. కానీ మహేష్ మాత్రం తనతో చాలా బాగా మాట్లాడాడని.. తనకు అండగా నిలిచాడని చెప్పాడు శ్రీకాంత్.
తన కొత్త చిత్రం పెదకాపు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ రెస్పాన్స్ ఏంటో వెల్లడించాడు.
సినిమా పోయాక మహేష్ తనతో మాట్లాడుతూ.. మనం బాగానే ఉన్నాం కదా, కొన్నిసార్లు ఇలా అవుతుంటాయి అని ధైర్యం చెప్పినట్లు శ్రీకాంత్ తెలిపాడు. మనం కష్టంలో ఉన్నపుడు అండగా నిలిచే వాళ్లు ఉండటం ముఖ్యమని.. మహేష్ అలాగే తనకు సపోర్ట్ ఇచ్చాడని అతను చెప్పాడు.
ఇదిలా ఉండగా.. తమ కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీక్వెల్ వచ్చే అవకాశాలున్నట్లు శ్రీకాంత్ సంకేతాలు ఇవ్వడం విశేషం. నిర్మాత దిల్ రాజే ఈ ఆలోచన చేశాడని.. ఒక రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తే ఆ సినిమా సీక్వెల్ ఆలోచన వచ్చిందంటూ తనకు ఫోన్ చేసి చెప్పాడని.. ఇది ఈ మధ్యే జరిగిందని కూడా శ్రీకాంత్ చెప్పడం విశేషం. ఐతే ఈ సినిమా కార్యరూపం దాల్చాలంటే కథ సహా అన్నీ కుదరాలని.. కాబట్టి వేచి చూద్దాం అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on September 25, 2023 9:58 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…