Movie News

కిరాతకంగా హత్యలు చేసే ‘గాడ్’

సైకో కిల్లర్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. వినడానికి ఒకే కథల్లా అనిపించినా వాటిని దర్శకులు హ్యాండిల్ చేసే తీరు కాలంతో సంబంధం లేకుండా హిట్లు తెచ్చి పెడుతుంటాయి. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ సైకో నుంచి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు దాకా ఇలా ఎన్నో వచ్చాయి. ఫ్లాప్ అయినవి లేకపోలేదు. ముఖ్యంగా వెబ్ సిరీస్ కల్చర్ వచ్చాక వీటి తాకిడి మరింతగా పెరిగింది. ఈ కోవలో వస్తున్న మరో మూవీ గాడ్.  పొన్నియిన్ సెల్వన్ నుంచి తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్న జయం రవి హీరోగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నయనతార హీరోయిన్ కావడం కొంత హైప్ తెస్తోంది.

ఇందాక ట్రైలర్ రిలీజ్ చేశారు. స్మైలీ బ్రహ్మ(రాహుల్ బోస్)గా పేరు పొందిన హంతకుడు కేవలం టీనేజ్ వయసు దాటని అమ్మాయిలను అతి దారుణంగా హత్య చేస్తూ ఉంటాడు. పోలీసులు పట్టుకుంటారు కానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి మారణకాండ కొనసాగిస్తాడు. ఈ కేసు కోసమే నియమించబడిన పోలీస్ ఆఫీసర్ అర్జున్(జయం రవి)కి జాలిదాయ ఉండవు. అలాంటి వాడిని సైతం భయపడేలా చేస్తాడు బ్రహ్మ. అర్జున్ కో ప్రియురాలు(నయనతార)ఉంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య పులిమేక వేటలో ఎవరు గెలిచారో తేలాలంటే తెరపై చూడాల్సిందే.

విజువల్స్ చాలా డెప్త్ గా ఉన్నాయి. బ్లర్ చేసినప్పటికీ వయొలెంట్ కంటెంట్ ఎక్కువగా దట్టించారు. చిన్నపిల్లలా సంగతి తర్వాత పెద్దలు సైతం భయపడేలా ఉన్నాయి. అయినా కిల్లర్లంటే కేవలం యువతులనే హత్యలు చేసే వాళ్ళుగా పదే పదే ఎందుకు చూపిస్తారో అర్థం కాదు. గతంలో జయం రవితోనే జాంబీ మూవీ మిరుతన్(యమపాశం) తీసిన ఐ అహ్మద్ దీనికి దర్శకుడు. సస్పెన్స్ ఫ్యాక్టర్ పుష్కలంగా ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ బోస్ విశ్వరూపం చూపించినట్టున్నాడు. కమింగ్ సూన్ అన్నారు కానీ విడుదల తేదీ లేదు. తమిళ వెర్షన్ సెప్టెంబర్ 28 రానుంది.

This post was last modified on September 25, 2023 9:38 pm

Share

Recent Posts

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago