బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ వచ్చేసి రెండు వారాలు దాటిపోయింది. దాదాపు అందరూ చూసేసి వరల్డ్ వైడ్ వెయ్యి కోట్ల గ్రాస్ దాటించేశారు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు మినహాయించి దేశమంతా బాగా డౌన్ అయిపోయింది. ఫైనల్ రన్ దగ్గరగా ఉన్న మాట వాస్తవం. అయితే నెక్స్ట్ ఇంకో హిట్ ఏది వస్తుందాని హిందీ బయ్యర్లు ఆసక్తిగా ఎదురు చూశారు. వాళ్ళ నిరీక్షణకు తగ్గట్టే యష్ రాజ్ ఫిలింస్ ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీని మొన్న శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేసింది. పెద్ద సంస్థ కావడంతో సరిపడా స్క్రీన్లు, అవసరమైన పబ్లిసిటీ అంతా చేశారు. తీరా చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అయిపోయింది.
గొప్ప కుటుంబం పేరుతో వచ్చిన ఈ మూవీని ఆడియన్స్ తిరస్కరించారు. వసూళ్లు చాలా తీసికట్టుగా ఉన్నాయి. విక్కీ కౌశల్ హీరో. సనాతన ధర్మం, సంప్రదాయాలు ఆణువణువూ నాటుకుపోయిన కుటుంబంలో పుట్టిన ఓ యువకుడికి షాకిచ్చే రేంజ్ లో తన జన్మ రహస్యం తెలుస్తుంది. ఆ తర్వాత అతని లవ్ ప్లస్ ఫ్యామిలీలో జరిగే సరదా సంఘటనల సమాహారం తెరమీద చూడాలి. ధూమ్ మొదటి రెండు భాగాలకు కథలు ఇచ్చి, ధూమ్ 3నే తన డైరెక్ట్ చేసిన విజయ్ కృష్ణ ఆచార్య ఇంత పేలవమైన కథను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. థగ్స్ అఫ్ హిందుస్థాన్ దెబ్బ కాబోలు రూటు మార్చుకున్నాడు.
ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న విజయ్ కృష్ణ దానికి తగ్గ కథనాలు, సంభాషణలు సమకూర్చుకోలేదు. దాంతో ప్రొడక్షన్ వేల్యూస్ ఎంత గ్రాండ్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే నీరసంగా మారిపోయి సహనానికి పరీక్ష పెడుతుంది. విక్కీ కౌశల్, డెబ్యూ హీరోయిన్ మానుషీ చిల్లార్ నటన పరంగా బాగానే చేసినప్పటికీ డ్రామా మరీ శృతి మించిపోవడంతో ఎక్కడా గ్రేట్ అనిపించుకోలేకపోయింది. యావరేజ్ ఉన్నా ఏదో జర హట్కె జర బచ్కె తరహాలో గట్టెక్కుతుందనుకుంటే అలాంటిదేమి లేకుండా ఇంటర్వెల్ ముందే ఇంటికి వెళ్లిపోదామా అనే రేంజ్ లో చిరాకు పుట్టిస్తుంది. ఆపై ఆడియన్స్ ఇష్టం.
This post was last modified on September 27, 2023 6:13 pm
మెగాభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకో 15 రోజులు మాత్రమే టైముంది. ప్రమోషన్లు రెగ్యులర్…
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…