శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు మెగా అభిమానులు ఆనందం అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతోమంది టాలీవుడ్ స్టార్లు శంకర్‌తో సినిమా చేయాలని ఆశపడగా.. వాళ్లెవ్వరి కోరికా తీరలేదు. అలాంటిది చరణ్‌కు ఈ ఛాన్స్ వచ్చిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా హిట్‌తో చరణ్ గ్లోబల్ స్టార్‌గా అవతరించిన నేపథ్యంలో శంకర్ లాంగటి లెజెండరీ డైరెక్టర్‌తో సరైన సినిమా పడితే దీని రేంజే వేరుగా ఉంటుందని అనుకున్నారు.
కానీ ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. ఈ సినిమాకు మేకింగ్ దశలో అస్సలు కలిసి రావట్లేదు. కొన్నాళ్లు చకచకా షూటింగ్ జరిగినప్పటికీ.. తర్వాత అన్నీ అవాంతరాలే. ‘ఇండియన్-2’ను దీంతో పాటే సమాంతరంగా చేయాలనుకున్నప్పటి నుంచి ‘గేమ్ చేంజర్’ ముందుకు సాగట్లేదు. ఎన్నోసార్లు షూటింగ్‌కు బ్రేక్ పడింది. షెడ్యూళ్లు రద్దయ్యాయి.
అన్ని అడ్డంకులనూ దాటి ఎట్టకేలకు ఓ పెద్ద షెడ్యూల్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకోగా.. అంతలోనే షూట్ క్యాన్సిల్ అని వార్త బయటికి వచ్చింది. ఈ వార్త బయటికి రాగానే మెగా అభిమానులు మరోసారి శంకర్ మీద పడిపోయారు. కానీ ఈసారి షెడ్యూల్ రద్దవడానికి శంకర్ కారణం కాదంటూ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
ఈ షెడ్యూల్లో భాగం కావాల్సిన కొందరు ముఖ్యమైన ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్లే షూట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని ప్రకటించారు. కానీ ఈ ప్రకటనను అభిమానులు నమ్మట్లేదు. కొందరు ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు కానంత మాత్రాన మొత్తంగా షెడ్యూల్ ఆపేస్తారా.. సినిమాలో ఇంకా చాలా భాగం షూట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో వారి కాంబినేషన్ లేకుండా వేరే సన్నివేశాలు ప్లాన్ చేసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
శంకర్‌ను పదే పదే టార్గెట్ చేస్తుండటంతో కవర్ చేయడం కోసం మొక్కుబడిగా ఒక ప్రకటన ఇచ్చినట్లుందే తప్ప.. ఇందులో వాస్తవం కనిపించడం లేదని… షూట్ ఆలస్యం కావడానికి శంకరే కచ్చితంగా బాధ్యుడని.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా హిట్ తర్వాత చరణ్ అందుబాటులోకి వస్తే అతణ్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడని.. విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాడని శంకర్ మీద మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on September 25, 2023 6:29 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…