ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు శతదినోత్సవం చాలా మాములు విషయం కాని ఇప్పుడలా కాదు. ఒక నెల రోజులు స్ట్రాంగ్ గా నిలబడితే అదే గొప్ప. ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే ఇంతకు మించి ఆడిన దాఖలాలు కనిపించవు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు సైతం యాభై రోజుల తర్వాత అమాంతం నెమ్మదించినవే. పైగా ఓటిటిల తాకిడిలో మహా అయితే నాలుగు వారాలకు మించి గ్యాప్ దొరకడం లేదు. జైలర్ లాంటి బంపర్ హిట్టే అమెజాన్ ప్రైమ్ లో నెలరోజులకు వచ్చేసింది. కానీ సంక్రాంతి సినిమాలు ఇంకా కొన్ని చోట్ల నాన్ స్టాప్ గా ఆడుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
చిరంజీవి వాల్తేరు వీరయ్య అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్ లో ఇటీవలే 250 రోజులు పూర్తి చేసుకుంది. దీనికి పోటీగా బాలకృష్ణ వీరసింహారెడ్డి ఆలూరులోని శ్రీ లక్ష్మినరసింహ టాకీసులో నిర్విరామంగా ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. అలా అని వీటికి జనం ఇంకా వస్తున్నారాని ఆశ్చర్యపోకండి. ఈ సినిమాల రన్ ని అభిమానులు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ముందు ఎవరు తీస్తారో చూద్దామని బలవంతంగా రోజు నాలుగు షోల చొప్పున ఆడిస్తూనే ఉన్నారు. పట్టుమని పది మంది కూడా రాలేని పరిస్థితిలో ఎందుకీ పంతమంటే దానికి సమాధానం సదరు ఎగ్జిబిటర్ల వద్ద కూడా లేదు.
చోద్యం కాకపోతే ఈ రోజుల్లో కూడా ప్రతిష్ఠకు పోయి ఇలా ఆడించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైపెచ్చు భవిష్యత్ తరాల వారు ఇవి నిజంగానే అన్నేసి రోజులు హౌస్ ఫుల్స్ ఆడాయని అనుకునే ప్రమాదం ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ ఘనవిజయం సాధించినవే కానీ మరీ ఇంత సుదీర్ఘమైన రన్ కి ఛాన్స్ ఉన్నవి కాదు. ఈ లెక్కన మెల్లగా ఇవి ఏడాది ఆడేలా ఉన్నాయి. గతంలో పోకిరి, మగధీర, లెజెండ్ లు ఫైవ్ హండ్రెడ్ డేస్ దాటేసి బెంచ్ మార్క్ సెట్ చేశాయి. మరి చిరు బాలయ్యలు కూడా వాటి సరసన తమ సినిమాలని నిలబెడతారో ఏమిటో చూడాలి.
This post was last modified on September 25, 2023 1:28 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…