ఈ వీకెండ్ స్కంద, చంద్రముఖి 1, పెదకాపు 1లతో రసవత్తరంగా ఉంటుందని అనుకుంటే తాజాగా ఈ లిస్టులో మరొకటి వచ్చి చేరింది. జయం రవి హీరోగా తమిళంలో రూపొందిన ఇరైవన్ ని తెలుగులో ఆఘమేఘాల మీద డబ్బింగ్ చేసి గాడ్ పేరుతో విడుదల చేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ వెర్షన్ కి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో నయనతార హీరోయిన్. విలక్షణ నటుడు రాహుల్ బోస్ సైకో కిల్లర్ గా నటించిన ఈ సస్పెన్స్ డ్రామా ట్రైలర్ ఇవాళ సాయంత్రం రానుంది. విజువల్స్ డిస్టర్బ్ చేసేలా వయోలెంట్ గా ఉంటాయి.
చివరి నిమిషం హడావిడి కాబట్టి ఎంతమేరకు థియేటర్లు దక్కుతాయో చూడాలి. జయం రవి మాత్రం ఈ గాడ్ ని ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలతో కలిసి చూడొద్దని అంటున్నాడు. ఒక వర్గం ఆడియెన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకుని తీశామని, సున్నితమైన మనసులున్న వారు ఈ వయొలెన్స్ ని తట్టుకోలేరని ముందే హింట్ ఇస్తున్నాడు. మనుషులను దారుణంగా చంపి వాళ్ళ శరీర భాగాలను వేరు చేసే ఒక సైకోని పట్టుకునే ఆఫీసర్ గా రవి ఇందులో నటించాడు. నయనతార అతని కొలీగ్ గా కనిపించనుంది. రెగ్యులర్ స్టైల్ లో కాకుండా డిఫరెంట్ టోన్ తో దీని స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్.
అయినా ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల పుణ్యమాని సైకో కథలు చాలా మాములు విషయమైపోయాయి. వీటి ప్రభావం జనాల మీద ఉంటోందని విశ్లేషకులు అంటున్నా దర్శకులు ఇలాంటి కథల వైపే మొగ్గు చూపుతున్నారు. మరి గాడ్ లో అంత భయపడే కంటెంట్ ఏముందో చూడాలి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు ఈ జానర్ లో మంచి సక్సెస్ అందుకున్నాక తిరిగి ఆ స్థాయిలో మరో బ్లాక్ బస్టర్ ఈ బ్యాక్ డ్రాప్ లో ఎవరికీ పడలేదు. గాడ్ ఏమైనా విభిన్నంగా ఉంటుందేమో చూడాలి. జయం రవికి ఇక్కడ మార్కెట్ లేదు కాబట్టి గాడ్ ని నయనతార సినిమాగానే ప్రోమోట్ చేస్తున్నారు నిర్మాతలు.
This post was last modified on September 25, 2023 1:23 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…