ఎంత కాదనుకున్నా గణేశుడి పండక్కు సినిమా పాటలకు విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా డిజె కల్చర్ వచ్చాక ఇది మరింతగా విస్తృతమయ్యిందే తప్ప తగ్గలేదు. మండపాల దగ్గర రాత్రిళ్ళు పెట్టుకునే గీతాలు, నిమజ్జనం రోజు ఊరేగింపులో చెవులు బద్దలు కొట్టే పాటలు అన్నీ టాలీవుడ్ కు సంబంధించినవే ఉంటాయి. అలా ఎవర్ గ్రీన్ గా కొన్ని నిలిచిపోయాయి. వాటిలో మొదటిది వెంకటేష్ కూలి నెంబర్ వన్ లోని అండ్రాలయ్యా ఉండ్రాలయ్యా. ఇళయరాజా కంపోజింగ్ లో సిరివెన్నెల రాసిన ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ కి జనరేషన్ తో సంబంధం లేకుండా కనెక్ట్ అవుతారు.
తర్వాత జై చిరంజీవిలో మణిశర్మ స్వరపరిచిన జైజై గణేశా జై కొడతా గణేశా అంటూ చంద్రబోస్ చేసిన పదాల అల్లిక దాన్ని కూడా హాట్ ఫెవరెట్ గా మార్చింది. కోడిరామకృష్ణ దేవుళ్ళులో జయజయ వినాయక వీటిని మించి ఉంటుంది. వందేమాతరమ్ శ్రీనివాస్ రూపకల్పన అది. ఆ తర్వాత నాగార్జున దేవదాస్, రామ్ జస్ట్ గణేష్ లలో ఈ టైపు పాటలు వచ్చాయి కానీ పైన చెప్పిన వాటి స్థాయిలో గుర్తుండిపోలేదు. తాజాగా భగవంత్ కేసరిలో తమన్ కు అలాంటి ఛాన్స్ వచ్చింది. పండగను దృష్టిలో పెట్టుకునే చాలా ముందుగానే దీని లిరికల్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
బ్యాడ్ లక్ ఏంటంటే వెరైటీ బీట్స్ తో తమన్ ఏదో కొత్తగా ట్రై చేశాడు కానీ గణేష్ యాంతం శ్రోతలకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. పదిహేడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి కానీ ఎక్కడ చూసినా హోరెత్తిపోవాల్సిన పాట పెద్దగా వినిపించడం లేదు. బాలయ్య, శ్రీలీలలు సూపర్ మాస్ డాన్స్ తో ఎంత హుషారెత్తించినా సగటు మాస్ జనాలు సులభంగా పాడుకునేలా తమన్ మేజిక్ చేయలేకపోయాడు. ఒకవేళ ట్యూన్ క్యాచీగా పడి ఉంటే ఇంకో మంచి పాట దశాబ్దాల తరబడి గుర్తుండిపోయేది. ఒకరకంగా చెప్పాలంటే తమన్ మంచి ఛాన్స్ మిస్ చేశాడు. తెరమీద చూశాక ఏమైనా అభిప్రాయం మారుతుందేమో చూడాలి.
This post was last modified on September 25, 2023 1:15 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…