‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ‘మనీ’ సినిమాలోని ఓ పాటలోని పంక్తినే టైటిల్‌గా పెట్టుకుని సినిమా చేశాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఈ పేరు చూస్తేనే సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది అర్థమైపోయింది. పెళ్లి వద్దు సింగిల్ లైఫే ముద్దు అంటూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రోమోలు అందరినీ ఆకట్టుకున్నాయి.
‘నో పెళ్లి’ అనే పాట కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు తేజు ఓ ఆసక్తికర అప్ డేట్‌తో ట్విట్టర్ ఫాలోవర్లను పలకరించాడు. అది సినిమా ప్రమోషన్ కోసం చేసిందా.. అతడి నిజ జీవితానికి సంబంధించిందా అన్న విషయమే అర్థం కావట్లేదు.
తేజు ఆదివారం ఉదయం ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. ‘సింగిల్ ఆర్మీ’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో తేజుతో పాటు ప్రభాస్, రానా, నితిన్, నిఖిల్, వరుణ్ తదితరులు ఉండగా.. అందులో పెళ్లి ఖాయమవ్వగానే నిఖిల్, నితిన్, రానా.. ఒకరి తర్వాత ఒకరు గ్రూప్ నుంచి వెళ్లిపోయినట్లు చూపించి.. చివరగా ‘ఇట్స్ మై షో టైమ్ సారీ ప్రభాస్ అన్నా’ అని తేజు కూడా ఎగ్జిట్ అయినట్లు ఈ వీడియోను ముగించారు. బ్యాగ్రౌండ్లో పెళ్లి మ్యూజిక్ వినిపించారు. పూర్తి వివరాలకు సోమవారం ఉదయం వరకు ఎదురు చూడమని చెప్పాడు తేజు.
ఈ వీడియో చూడగానే తేజు కూడా పెళ్లి కొడుకు అయిపోతున్నాడా.. అతడి పెళ్లి ఖాయమైందా అన్న సందేహాలు కలిగాయి అభిమానులకు. ఐతే సినిమాలో హీరో లైఫ్ యు టర్న్ తీసుకుని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చే పాటను రేపు లాంచ్ చేయబోతున్నారని.. అందుకే ఈ హంగామా అంతా అని అంటున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సైతం దీని గురించి ట్విట్టర్లో అప్ డేట్ ఇచ్చిన నేపథ్యంలో ఇది కచ్చితంగా ‘పబ్లిసిటీ స్టంట్’యే అన్నది స్పష్టమవుతోంది. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
This post was last modified on August 24, 2020 10:23 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…