Movie News

వేరే ఆప్షన్ లేదు.. ఆ సినిమానే చూద్దాం

జవాన్ సినిమా చూసి ఏముంది ఇందులో అని పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. పాత కథలను అటు ఇటు తిప్పి మసాలా సినిమాలు రెడీ చేయడంలో సిద్ధహస్తుడైన తమిళ దర్శకుడు అట్లీ.. ‘జవాన్’ విషయంలోనూ అదే చేశాడు. ఇందులోని కథ.. పాత్రలు.. సన్నివేశాలు.. చాలా వరకు వేరే చిత్రాలను గుర్తు చేశాయి. కానీ కొత్తదనం రవ్వంత కూడా లేకపోయినా.. బోర్ కొట్టించకుండా నడిచిపోవడం.. ఫ్యాన్ మూమెంట్స్, కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పాసైపోయింది.

ఐతే ఎంతైనా కంటెంట్ వీక్ కావడంతో ‘జవాన్’ తొలి వీకెండ్ తర్వాత ఏమాత్రం నిలబడుతుందో అని సందేహించారు. తొలి మూణ్నాలుగు రోజుల్లో ఉన్న ఊపు తర్వాత ఉండదనుకున్నారు. కానీ ఈ సినిమాకు రెండు వారాల తర్వాత వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. మూడో వీకెండ్లో కూడా ‘జవాన్’ అదరగొట్టింది.

వరల్డ్ వైడ్ ‘జవాన్’ వసూళ్లు రూ.950 కోట్లకు చేరువగా ఉండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోబోతోంది. ‘జవాన్’ అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. మూడు వారాలుగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు. హిందీలో తొలి వారం ఈ చిత్రంతో పాటు ఏ సినిమా రిలీజ్ కాలేదు. తర్వాతి రెండు వారాల్లో కూడా చిన్న సినిమాలే వచ్చాయి.

బాక్సాఫీస్ దగ్గర దీన్ని ఛాలెంజ్ చేసే సినిమాలే లేకపోయాయి హిందీలో. ఇక తెలుగులో ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ కొంత పోటీ ఇచ్చినా.. అది కాక వేరే సినిమాలు గత రెండు వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. తమిళంలో కూడా ‘జవాన్’కు పెద్దగా పోటీ లేకపోయింది. అలా అన్ని చోట్లా ‘జవాన్’ బాక్సాఫీస్ రన్ ఇబ్బంది లేకుండా సాగిపోయింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. వేరే ఆప్షన్ లేక దీన్నే చూస్తుండటం కలిసొచ్చింది. అలా ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కును అందుకోబోతోంది.

This post was last modified on September 24, 2023 3:46 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

9 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago