మాములుగా ఒక పెద్ద సినిమాకు హిట్ టాక్ వస్తే కనీసం వారం రోజుల పాటు దానికి మంచి రన్ దక్కుతుంది. కానీ ఖుషి విషయంలో మాత్రం ఇది రివర్స్ జరిగింది. ఫస్ట్ వీకెండ్ దాటడం ఆలస్యం డెబ్భై కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ప్రకటించిన నిర్మాతలు ఆ తర్వాత సోమవారం నుంచి నమోదైన డ్రాప్ చూసి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. సక్సెస్ మీట్ చేసి కుటుంబానికో లక్ష చొప్పున కోటి రూపాయలు పంచిన విజయ్ దేవరకొండకు ఆ ఆనందమైతే మిగిలింది కానీ గీత గోవిందం రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఆశలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆవిరైపోయాయి.
ఎంత లేదన్నా పన్నెండు కోట్ల దాకా ఖుషి థియేట్రికల్ లాస్ మిగిలించిందని ట్రేడ్ టాక్. ఇదిలా ఉండగా నెల తిరగడం ఆలస్యం ఇప్పుడిది ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్య పెద్దగా వర్కౌట్ కాని భారీ చిత్రాల విషయంలో సదరు ఓటిటి ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటోంది. ఇటీవలే భోళా శంకర్. ఇవాళ గాండీవధారి అర్జున గుట్టుచప్పుడు కాకుండా వచ్చేశాయి, చాలా తక్కువ గ్యాప్ లో వీటిని డిజిటల్ లో వదలడం గమనించాల్సిన విషయం.
ఒకప్పుడేమో కానీ ఇప్పుడు కొత్త సినిమాలు నెల లోపే డిజిటల్ బాట పట్టడం చాలా మాములు విషయమైపోయింది. అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన జైలర్ సైతం మినహాయింపుగా నిలవలేదు. చాలా చోట్ల మంచి వసూళ్లు వస్తున్నా సరే సన్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేసి ముప్పై రోజులకే స్మార్ట్ స్క్రీన్ మీదకు వదిలేసింది. ఇకపై కూడా ఈ ట్రెండ్ కొనసాగనుంది. గత ఏడాది నుంచి కనీసం ఎనిమిది వారాల గ్యాప్ నిబంధనను అమలు చేయాలనుకున్న నిర్మాతల సమాఖ్యలో సభ్యులే దానికి కట్టుబడలేక వదిలేశారు. ఇక చోటా ప్రొడ్యూసర్ల సంగతి సరేసరి. అది పాటించడం జరిగే పని కాదని అర్థమైపోయింది.
This post was last modified on September 24, 2023 1:13 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…